త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్

Green India Challenge | మ‌హారాష్ట్ర‌లోని లాతూర్‌ను పచ్చగా మార్చేందుకు గత 2,693 రోజులుగా నిరంతరం చెట్లు నాటుతూ, పెంచుతూ వస్తున్న ‘ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్ (Aamcha Green Latur Vruksha Foundation) గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge)లో చేరింది.

G

Telangana | Published On Oct 14, 2026, 11.09 am IST

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్
Advertisement

Green India Challenge | త్రినేత్ర న్యూస్‌: మ‌హారాష్ట్ర‌లోని లాతూర్‌ను (Latur) పచ్చగా మార్చేందుకు గత 2,693 రోజులుగా నిరంతరం చెట్లు నాటుతూ, పెంచుతూ వస్తున్న ‘ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్ (Aamcha Green Latur Vruksha Foundation) గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge)లో చేరింది. డాక్టర్ పవన్ లడ్డా నాయకత్వంలో లాతూర్‌కు చెందిన వైద్యులు, ఇంజినీర్లు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు సహా నిపుణుల బృందం గత 2,692 రోజులుగా నగరంలో చెట్ల పెంపకం చేస్తున్న‌ది. ఇప్పటి వరకు లాతూర్ నగరం, పరిసర ప్రాంతాల్లో వేలాది చెట్లను నాటారు. ఒకప్పుడు నీటి కోసం రైళ్లపై ఆధారపడిన లాతూర్.. ఈ ఫౌండేషన్ నాటిన చెట్ల వల్ల ఇప్పుడు పచ్చగా, సుందరంగా మారింది.

గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (Santhosh Kumar) నాయకత్వంలో, సహ వ్యవస్థాపకులు రాఘవ్ మార్గదర్శకత్వంలో ‘ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్’ ఈ ఉద్యమంలో చేరింది. లాతూర్, పరిసర ప్రాంతాలను మరింత పచ్చగా మార్చేందుకు పెద్ద ఎత్తున చెట్ల పెంపకం చేపడతామని డాక్టర్ పవన్ లడ్డా ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ మహారాష్ట్ర కోఆర్డినేటర్ సుధీర్ బిందు ఫౌండేషన్ సభ్యులకు శమి (జమ్మి) చెట్టును బహుకరించి స్వాగతం పలికారు. లాతూర్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Advertisement
Advertisement