Kollapur | భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి ఉరేసుకున్న భార్య
Kollapur | ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేశారు. తల్లిదండ్రుల మాట కాదనలేక బలవంతంగానే వివాహం చేసుకుంది. పెళ్లాయ్యాక కూడా ఆమె మనసు ప్రియుడి మోజులోనే ఉంది. నిత్యం ప్రియుడితో చాటింగ్ చేస్తుండడంతో.. కట్టుకున్న భర్త మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు తన ప్రియుడితో కలిసి ఉరేసుకుంది.
Kollapur | త్రినేత్ర.న్యూస్ : ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేశారు. తల్లిదండ్రుల మాట కాదనలేక బలవంతంగానే వివాహం చేసుకుంది. పెళ్లాయ్యాక కూడా ఆమె మనసు ప్రియుడి మోజులోనే ఉంది. నిత్యం ప్రియుడితో చాటింగ్ చేస్తుండడంతో.. కట్టుకున్న భర్త మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు తన ప్రియుడితో కలిసి ఉరేసుకుంది. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో వెలుగు చూసింది.
కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన శివ(25).. రేణుక(23)ను ప్రేమించాడు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు.. కానీ ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ప్రేమించిన వాడిని వదులుకోని, మనసు చంపుకొని.. పెద్దలు కుదర్చిన సంబంధానికి తలూపింది.
రెండేళ్ల క్రితం రేణుకకు వేరే వ్యక్తితో వివాహం కాగా, ఏడాదిన్నర వయసు కుమార్తె ఉంది. ఇక రేణుక తన ప్రియుడితో చాటింగ్ చేసేది. వారం క్రితం కూడా ఆమె అతనితో చాటింగ్ చేయగా, భర్త గమనించి మందలించాడు. దాంతో పుట్టింటికి చేరుకున్న రేణుక.. శుక్రవారం అర్ధరాత్రి పాపను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. పాప ఏడుపు విన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమై రేణుక కోసం గాలించారు. గ్రామ శివారులో రేణుక తన ప్రియుడు శివతో కలిసి ఉరేసుకుంది. చెట్టుకు వేలాడుతున్న వారిద్దరిని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాకయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

Cabinet Sub-Committee | ఎగుమతి రకాలపై రైతులకు అవగాహన కల్పించాలి
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



