Municipal Elections | బుద్ధి ఉందా..! పొట్లంలో కోడి మాంసంపై ఓటరు ఆగ్రహం..!!
Municipal Elections | రాష్ట్రంలో నిన్నటి వరకు మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ప్రచారంతో పాటు తాయిలాలు కూడా అందించారు. నగదు పంపిణీతో పాటు మద్యం, కోడి, మేక మాంసంతో ఓటర్లకు ఎర వేశారు.
Municipal Elections | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో నిన్నటి వరకు మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ప్రచారంతో పాటు తాయిలాలు కూడా అందించారు. నగదు పంపిణీతో పాటు మద్యం, కోడి, మేక మాంసంతో ఓటర్లకు ఎర వేశారు. కులాల వారిగా, కాలనీల వారిగా మద్యం, మాంసంతో ఓటర్లకు విందులు ఏర్పాటు చేసి ఆకర్షించే ప్రయత్నం చేశారు.
అయితే వనపర్తి జిల్లాలోని కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో.. ఓ పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నాడు. పొద్దున్నే ప్రతి ఇల్లు తిరుగుతూ.. ఓటర్ల నివాసాల్లో ఓ పొట్లంతో పాటు తన గుర్తును పెట్టి వెళ్లిపోతున్నాడు.
ఇక ఓ ఇంటి ముందు మహిళ కల్లాపి చల్లి ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో సదరు అభ్యర్థి వడివడిగా ఆమెతో ఇంట్లోకి వెళ్లాడు. అక్కడున్న కుర్చీపై ఓ పొట్లంతో పాటు తన గుర్తును పెట్టి బయటకు వచ్చేశాడు. అతను వెళ్లాక పొట్లంలో ఏం ఉందో చూసిన యజమాని అవాక్కయ్యాడు. వెంటనే బయట మురుగు కాల్వలోకి పొట్లం విసిరేసి బుద్ధి ఉందా అని అరిచారు. ఇంతకీ ఆ పొట్లంలో ఏం ఉందంటే కోడి మాంసం ఉందట. ఇంటి యజమాని శాకాహారి కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇలాంటి నీచమైన పనులు చేయొద్దని, ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దని దుమ్మెత్తిపోశారు. ఈ సంఘటన కొత్తకోటలో చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



