Bandi Sai Bhagirath | బండి భగీరథ్ అకృత్యాలు ఇవే..! రెండుసార్లు అమ్మాయి ఆత్మహత్యాయత్నం..!!
Bandi Sai Bhagirath | కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడ్డ స్నేహం.. ప్రేమగా మారింది. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆపై మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ప్రేమ పేరుతో షికారుకు తీసుకెళ్లినప్పటికీ.. ఆమెను లైంగికంగా వేధించాడు.. హింసించాడు.. అఘాయిత్యాలకు ఒడిగట్టాడు. ఆరు నెలల కాలంలోనే బండి సాయి భగీరథ్ ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ప్రేమ, పెళ్లి పేరుతో లోబరుచుకున్నాడు
నీ భవిష్యత్ ఏంటో నాకు తెలుసంటూ
ఆమెకు చదువుకు అడ్డుపడ్డాడు
ఫామ్ హౌస్‌లకు తిప్పుతూ..
కోరికలు తీర్చాలని బలవంతం
ప్రతిఘటిస్తే అఘాయిత్యాలు
వదిలించుకుంటున్నానని ప్రేమ పలుకులు
డిప్రెషన్‌లోకి బాధితురాలు
రెండు సార్లు ఆత్మహత్యాయత్నం
ఆరు నెలల్లోనే ఎన్నో అఘాయిత్యాలు
బాధితురాలి తల్లి ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడి
Bandi Sai Bhagirath | త్రినేత్ర.న్యూస్ : కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడ్డ స్నేహం.. ప్రేమగా మారింది. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆపై మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ప్రేమ పేరుతో షికారుకు తీసుకెళ్లినప్పటికీ.. ఆమెను లైంగికంగా వేధించాడు.. హింసించాడు.. అఘాయిత్యాలకు ఒడిగట్టాడు. ఆరు నెలల కాలంలోనే బండి సాయి భగీరథ్ ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన కూతురు చదువుకు అడ్డుపడి, ఆమె జీవితాన్ని నాశనం చేశాడని, చివరకు పెళ్లి చేసుకోనని, వదిలించుకుంటున్నానని ప్రేమపలుకులు పలికాడు.. దాంతో తన బిడ్డ తీవ్ర మానసిక క్షోభకు గురై రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, సకాలంలో అడ్డుకోవడంతో తన కుమార్తె ప్రాణాలను దక్కించుకున్నానని బాధితురాలి తల్లి ఫిర్యాదు ద్వారా వెల్లడైంది.
విషయం: నా మైనర్ కుమార్తెపై జరిగిన లైంగిక దోపిడీ, దుర్వినియోగం, బెదిరింపులు, డిజిటల్ వేధింపులు మరియు నేరపూరిత కుట్రకు సంబంధించి, పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం, 2012 మరియు బీఎన్ఎస్ ప్రకారం ఫిర్యాదు గురించి..!
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్.. అతని ఫ్రెండ్స్‌తో కలిసి తన బిడ్డను ట్రాప్ చేశాడు. పక్కా ప్రణాళిక ప్రకారం గతేడాది జూన్ నెలలో తన కుమార్తెతో భగీరథ్ పరిచయం పెంచుకుని, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ ద్వారా ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో భగీరథ్ ఫ్రెండ్స్ అతనికి సహకరించారు.
నిన్ను ఏం చదివించాలో నాకు తెలుసు..
ఇక ప్రేమ వరకే అతను ఆగిపోలేదు. మేజర్ కాగానే పెళ్లి చేసుకుంటానని లోబరుచుకున్నాడు. ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడు. తన బిడ్డ చదువును కూడా మధ్యలోనే ఆపేశాడు. నేనే పెళ్లి చేసుకుంటాను.. నీ భవిష్యత్ గురించి నాకు తెలుసు.. నిన్ను ఏం చదివించాలోనే తెలుసని తన బిడ్డ చదువుకు అడ్డుపడ్డాడు. నేను చెప్పినట్లు వినకపోతే చనిపోతానని బ్లాక్ మెయిల్‌కు పాల్పడి.. ఆమెకున్న ఫ్రెండ్స్‌ను కూడా దూరం చేసి.. స్వేచ్ఛ లేకుండా చేశాడు.
ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా..
బ్లాక్ మెయిల్‌కు పాల్పడటమే కాదు.. బండి భగీరథ్ ఒక ఉన్మాదిలా ప్రవర్తించేవాడు. శారీరకంగా గాయపరచడంతో పాటు లైంగికంగా వేధించేవాడు. మళ్లీ తన బిడ్డ ఎక్కడ ఎదురుతిరుగుతుందో అని చెప్పి.. వింత వింతగా ప్రవర్తిస్తూ.. ఇంకోసారి తప్పు చేయనని, క్షమించాలని కోరేవాడు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ రికార్డులు, చాటింగ్ వివరాలతో పాటు ఇతర ఆధారాలను సమర్పిస్తున్నాం. తన కుమార్తెకు కలిగిన శారీరక మరియు మానసిక క్షోభ అందులో స్పష్టంగా కనిపిస్తోంది..! నా కుమార్తెను సర్వీస్ అపార్ట్‌మెంట్‌లకు రావాలని అతను పట్టుబట్టిన సందర్భాలు, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెపై ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా ఆధారాల్లో ఉన్నాయి.
అక్కడ మూడు రోజులు ఉంచి అఘాయిత్యం..
అయితే గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల మధ్య పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మా సొంత అపార్ట్‌మెంట్‌కు భగీరథ్ వచ్చాడు. మా అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, అంతేకాకుండా తాకరాని చోట తాకేందుకు యత్నించాడని మా కుమార్తె చెప్పింది. 2025 అక్టోబర్ 25న అర్ధరాత్రి.. భగీరథ్ తన స్నేహితులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ వ్యూ అపార్ట్‌మెంట్స్‌కు నా బిడ్డను తీసుకెళ్లాడు. అక్కడే రెండు మూడు రోజులు ఉండాలని చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నా కుమార్తె ప్రతిఘటించినప్పటికీ.. తన కోరికలు తీర్చాలని బలవంతం చేశాడు. మళ్లీ 2025 నవంబర్ 13న మొయినాబాద్‌లోని లక్స్ చరణ్ ఫార్మ్ స్టేలో కూడా మా కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
డిసెంబర్ 31 రాత్రి కూడా.. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి..
బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డిసెంబర్ నెలలో మళ్లీ భగీరథ్ తన నివాసాలకు, ఫామ్‌హౌస్‌లకు తీసుకెళ్లాడు. 2025 డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని అనన్య ఫామ్స్‌కు తీసుకెళ్లి.. మరుసటి రోజు అర్థరాత్రి వరకు అక్కడే ఉంచి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మా కుమార్తె ప్రతిఘటించినప్పటికీ అందరూ కలిసి.. మద్యం (బ్రీజర్) సేవించమని ఆమెను ఒత్తిడి చేశారు. ఆ తర్వాత..బగీరథ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు..! ఈ దారుణ ఘటనతో మా కుమార్తె తీవ్ర భయాందోళనకు గురైంది. భగీరథ్ ఉన్మాద ప్రవర్తన చూసి తీవ్ర మనోవేదనకు గురైంది. అతని ప్రవర్తనతో తన బిడ్డ పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి.. ఇతరులపై ఆధారపడే స్థితికి వెళ్లింది.
సంబంధాలు తెంచుకుంటున్నానని..
2026 జనవరి 7వ తేదీన భగీరథ అకస్మాత్తుగా మాకు ఫోన్ చేసి.. మా బిడ్డతో ఉన్న సంబంధాలను తెంచుకుంటున్నానని, ఇందాక జరిగిన వాటిని మరిచిపోవాలని బెదిరించాడు. మానసిక ఉన్మాదిలా మారి ప్రేమ, పెళ్లి పేరుతో మా కుమార్తెను మభ్యపెట్టి వశపరుచున్న భగీరథ్.. ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా.. పచ్చి మోసం చేయడానికి.. వదిలించుకోవడానికి కుట్రలు మొదలు పెట్టాడు..!
జనవరిలోనే ఆత్మహత్యాయత్నం..
భగీరథ్ మోసంతో.. తన కుమార్తె పూర్తిగా మానసికంగా కుంగిపోయింది. క్షోభకు గురైంది.. డిప్రెషన్‌లోకి వెళ్లిన తన బిడ్డ జనవరి 19న, జనవరి 26న ఆత్మహత్యాయత్నం చేసింది. మేము సకాలంలో అడ్డుకోవడం వల్ల మా కుమార్తె మాకు దక్కింది..! అయితే చేసిన మోసంపై మా కుమార్తె భగీరథ్‌ను నిలదీసే సరికి అతను నీచమైన చర్యలకు పాల్పడ్డాడు.! మా కుమార్తె యొక్క వ్యక్తిగత, గోప్యమైన సమాచారం.. ఫోటోలను సోషల్ మీడియాలో చట్ట విరుద్ధంగా అప్‌లోడ్ చేసి.. అమ్మాయి పరువును బజారున పెట్టే ప్రయత్నం చేశాడు.
అన్యాయంపై న్యాయ పోరాటం..
తన బిడ్డకు జరిగిన అన్యాయంపై మేం న్యాయ పోరాటం చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో నిర్ణయించుకున్నాం. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని, పదేపదే ఫోన్ కాల్స్ చేస్తూ మమ్మల్ని ఒత్తిడికి గురి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న మా కుమార్తెకు తెలిసిన వ్యక్తి.. భగీరథ్‌కు కూడా పరిచయం ఉన్న వ్యక్తి చేత నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఒక తప్పుడు మరియు దురుద్దేశపూర్వక ఫిర్యాదును దాఖలు చేయించింది బండి కుటుంబం..! సదరు వ్యక్తిని నా కుమార్తె బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని సదరు ఫిర్యాదులో తప్పుడు ఆరోపణలు చేశారు..!
మేం ఎదురించడంతో.. బెదిరింపులకు దిగారు..
బండి సంజయ్ కుటుంబ సభ్యుల బెదిరింపులకు లొంగకపోవడంతో.. రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2026 ఏప్రిల్ 22న ఓ మాజీ జర్నలిస్టు మా ఇంటికి వచ్చి రాజీ చేసుకోవాలని ఆదేశించాడు. మరుసటి రోజు ఏప్రిల్ 23న బండి సంజయ్‌తో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయించాడు సదరు జర్నలిస్టు. రాజీపడాలి.. లేదంటే నిర్మల్ కేసు ఆధారంగా మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. బండి సంజయ్, జర్నలిస్టు ఇద్దరూ కలిసి తమను తీవ్ర భయాందోళనకు గురి చేశారని, అయినా వెనుకడుగు వేయకుండా.. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తాము లొంగలేదనే కోపంతో బండి సంజయ్ కరీంనగర్‌లో తమ కూతురిపై తమపై లేనిపోని నిందారోపణలు చేస్తూ ఆయన కుమారుడు భగీరథ్ చేత తప్పుడు ఫిర్యాదు చేయించాడు..!
జరిగిన సంఘటనల క్రమం మొత్తం, చట్ట ప్రకారం మైనర్ సమ్మతికి ప్రాధాన్యత లేని 'లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012' కింద నేరాలను, అలాగే దాడి, నేరపూరిత బెదిరింపు, పరువు నష్టం, మరియు కుట్ర వంటి బీ ఎన్ ఎస్ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతున్నాయి. మైనర్‌తో లైంగిక సంబంధం, అది సంబంధం లేదా వివాహ వాగ్దానం ముసుగులో ఉన్నప్పటికీ, తీవ్రమైన మరియు శిక్షార్హమైన నేరమని, మరియు భావోద్వేగపరమైన వేధింపులు, బలవంతం వంటివి అటువంటి చర్యల తీవ్రతను మరింత పెంచుతాయని గౌరవనీయ సుప్రీంకోర్టు స్థిరంగా పేర్కొంటూ వస్తోంది.
పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, నా కుమార్తెపై తదనంతరం తప్పుడు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన బండి బగీరథ్, శ్రీరామ్‌లపై తక్షణ చర్యలు ప్రారంభించాలని, న్యాయం జరిగేలా భవిష్యత్తులో ఎలాంటి ప్రాణహాని కలగకుండా నా కుమార్తెకు, మా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని మీ అధికార యంత్రాంగానికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పై వాస్తవాలు నాకు తెలిసినంతవరకు, నేను నమ్మినంతవరకు నిజమని తెలియజేస్తున్నాను, నా మైనర్ కుమార్తెకు న్యాయం జరిగేలా చూడటానికి తక్షణ న్యాయ జోక్యం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను అని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!
ఆగస్టు 19, 2026

Bandi Sanjay | 2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం
ఆగస్టు 19, 2026

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



