త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Infant Dies | జోగిపేట‌లో దారుణం.. 18 రోజుల ప‌సికందును నేల‌కేసి కొట్టిన తండ్రి

Infant Dies | ఓ తండ్రి మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. త‌న పండంటి 18 రోజుల ప‌సికందును నేల‌కేసి కొట్టాడు. ఈ దారుణ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట‌లో వెలుగు చూసింది.

S

Telangana | Published On Jul 18, 2026, 4.12 pm IST

Infant Dies | జోగిపేట‌లో దారుణం.. 18 రోజుల ప‌సికందును నేల‌కేసి కొట్టిన తండ్రి
Advertisement

Infant Dies | త్రినేత్ర‌.న్యూస్ : ఓ తండ్రి మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. త‌న పండంటి 18 రోజుల ప‌సికందును నేల‌కేసి కొట్టాడు. ఈ దారుణ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట‌లో వెలుగు చూసింది.

జోగిపేట‌కు చెందిన కృష్ణ‌, గౌరి దంప‌తులకు గ‌త కొన్నాళ్ల నుంచి గొడ‌వ‌లు ఉన్నాయి. ఇటీవ‌లే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే శ‌నివారం ఉద‌యం కూడా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య స్వ‌ల్ప వివాదం జ‌రిగింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన భ‌ర్త కృష్ణ‌.. త‌న 18 రోజుల ప‌సికందు ప‌ట్ల మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. ఆ ప‌సిబిడ్డ‌ను త‌న చేతుల్లోకి తీసుకొని నేల‌కేసి కొట్టాడు. అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లి గౌరి స్థానికుల‌తో క‌లిసి సంగారెడ్డి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శిశువు అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శిశువు మృతితో గౌరి శోక‌సంద్రంలో మునిగిపోయింది.

Advertisement
Advertisement