త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahabubnagar | ల‌క్ష రూపాయాల‌కు 15 రోజుల ప‌సికందు విక్ర‌యం..! కానీ కిడ్నాప్‌గా నాట‌కం..!!

Mahabubnagar | ఓ 15 రోజుల ప‌సికందును రూ. ల‌క్ష‌కు విక్ర‌యించారు. కానీ త‌ల్లిదండ్రులు కిడ్నాప్‌గా చిత్రీక‌రించి, పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారు.

S

Telangana | Published On Jul 18, 2026, 4.30 pm IST

Mahabubnagar | ల‌క్ష రూపాయాల‌కు 15 రోజుల ప‌సికందు విక్ర‌యం..! కానీ కిడ్నాప్‌గా నాట‌కం..!!
Advertisement

Mahabubnagar | త్రినేత్ర‌.న్యూస్ : ఓ 15 రోజుల ప‌సికందును రూ. ల‌క్ష‌కు విక్ర‌యించారు. కానీ త‌ల్లిదండ్రులు కిడ్నాప్‌గా చిత్రీక‌రించి, పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ రూర‌ల్ మండ‌ల ప‌రిధిలోని తెలుగుగూడెని ఏరియాకు చెందిన కేశ‌వులు, నీల‌మ్మ దంప‌తుల‌కు కొద్ది రోజుల క్రితం పండంటి బిడ్డ జ‌న్మ‌నిచ్చింది. అయితే జూలై 13న తాము ఇంట్లో లేని స‌మ‌యంలో త‌మ బిడ్డ‌ను అప‌హ‌రించార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు క‌లిసి విచార‌ణ చేప‌ట్ట‌గా, త‌ల్లిదండ్రుల ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం క‌లిగింది. దీంతో వారిని లోతుగా విచారించ‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది. త‌మ ప‌సికందును రూ. ల‌క్ష‌కు విక్ర‌యించిన‌ట్లు తేలింది. అయితే బిడ్డ‌ను కొనుగోలు చేసిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement