త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadadri Thermal Power Station | యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు

Yadadri Thermal Power Station | ల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (Fire incident) చోటు చేసుకుంది. పవర్‌ ప్లాంట్‌లోని యూనిట్‌-3లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ​టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ​

S

Telangana | Published On May 17, 2026, 3.08 pm IST

Yadadri Thermal Power Station | యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు
Advertisement

Yadadri Thermal Power Station | త్రినేత్ర‌.న్యూస్‌: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (Fire incident) చోటు చేసుకుంది. పవర్‌ ప్లాంట్‌లోని యూనిట్‌-3లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ​టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ​పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఈ ప్ర‌మాదంతో చుట్టుప‌క్క‌ల పరిసర ప్రాంతాల్లో పొగ ద‌ట్టంగా అలుముకుంది.

​కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రధాన యంత్రాలకు ముప్పు త‌ప్పిన‌ట్లు తెల‌స్తోంది. భారీగా మంట‌లు చెల‌రేగ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌తో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్ సేఫ్టి ప‌రిక‌రాల‌తో మంట‌లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు య‌త్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement