త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gadwal | గద్వాల జిల్లాలో దారుణం.. కూతురిని గ‌ర్భ‌వతిని చేసిన తండ్రి

Gadwal | కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన తండ్రే.. కూతురిపై క్రూర మృగంలా విరుచుకుప‌డ్డాడు. కామంతో క‌ళ్లు మూసుకుపోయాయి. బిడ్డ‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డి ఆమెను గ‌ర్భ‌వ‌తిని చేశాడు తండ్రి.

S

Telangana | Published On Dec 30, 2025, 1.25 pm IST

Gadwal | గద్వాల జిల్లాలో దారుణం.. కూతురిని గ‌ర్భ‌వతిని చేసిన తండ్రి
Advertisement

Gadwal | త్రినేత్ర‌.న్యూస్ : కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన తండ్రే.. కూతురిపై క్రూర మృగంలా విరుచుకుప‌డ్డాడు. కామంతో క‌ళ్లు మూసుకుపోయాయి. బిడ్డ‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డి ఆమెను గ‌ర్భ‌వ‌తిని చేశాడు తండ్రి. ఈ దారుణ ఘ‌ట‌న గ‌ద్వాల జిల్లాలో వెలుగు చూసింది.

గద్వాల జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఒక వ్యక్తి గతంలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం క‌ల‌గలేదు. తనకు పిల్లలు పుట్టడం లేదని తన చెల్లితో భర్తకు రెండో వివాహం జరిపించింది. రెండో భార్యకు నలుగురు పిల్ల‌లు జ‌న్మించారు. ఇదే సమయంలో మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు పుట్టారు.

ఈ క్రమంలో రెండో భార్య కూతురు(16)పై కన్నేసి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు తండ్రి. బాధితురాలు గర్భం దాల్చడంతో, విషయం బయటికి రాకుండా తండ్రి జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. బాలికకు మొద‌టి భార్య అబార్షన్ చేయించింది. ఈ విషయాన్ని బాలిక స్థానికంగా ఉండే మరో మహిళకు చెప్పగా, బాధితురాలి తల్లికి విషయాన్ని తెలియజేసింది. బాలిక కన్న తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. తండ్రితో పాటు అత‌ని మొద‌టి భార్య‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement