త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Houses | అట‌వీ భూముల్లో ఇందిర‌మ్మ ఇళ్లకు నో ప‌ర్మిష‌న్‌

Indiramma Houses | తెలంగాణ‌లోని నిరుపేద‌ల‌కు సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చాల‌నే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఇందిర‌మ్మ ఇళ్ల( Indiramma Houses )ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన‌ సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల ఇళ్ల నిర్మాణం సాగుతుండగా.. ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 3,800 కోట్ల నిధుల‌ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది.

S

Telangana | Published On Jan 1, 2026, 5.32 pm IST

Indiramma Houses | అట‌వీ భూముల్లో ఇందిర‌మ్మ ఇళ్లకు నో ప‌ర్మిష‌న్‌
Advertisement

Indiramma Houses | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లోని నిరుపేద‌ల‌కు సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చాల‌నే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఇందిర‌మ్మ ఇళ్ల( Indiramma Houses )ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన‌ సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల ఇళ్ల నిర్మాణం సాగుతుండగా.. ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 3,800 కోట్ల నిధుల‌ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అయితే అట‌వీ భూముల్లో( Forest lands ) మాత్రం ఇందిర‌మ్మ ఇళ్ల( Indiramma Indlu ) నిర్మాణానికి అట‌వీశాఖ అధికారులు( Forest Officials ) అనుమతులు ఇవ్వ‌క‌పోవ‌డంతో.. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం త‌ల‌లు ప‌ట్టుకుంటుంది. తమ సమ్మతి లేకుండా లేదా భూ రికార్డులను ధృవీకరించకుండా ఇళ్లకు అనుమతులు ఇవ్వడంపై అట‌వీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది.

ఉమ్మ‌డి ఆదిలాబాద్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు.. అట‌వీశాఖ అధికారుల తీరుపై అస‌హనం వ్య‌క్తం చేస్తున్నారు. అట‌వీ భూముల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో ప‌లువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విష‌యాన్ని ప‌లువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు( Khanapur MLA Vedma Bhojju ) ఈ విష‌యాన్ని నాలుగు రోజుల క్రితం అసెంబ్లీలో ప్ర‌స్తావించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్( Kawal Tiger Reserve ) జోన్ ప‌రిధిలో ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కానీ అట‌వీశాఖ అధికారులు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఇంటి నిర్మాణానికి అనుమ‌తి ఇవ్వ‌డం లేదు అని వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. ఇదే విష‌యాన్ని ఆదిలాబాద్ ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఇస్నాపూర్‌లో ప‌త్తి రైతులు ప‌త్తిని త‌ర‌లించేందుకు అట‌వీ మార్గంలో తాత్కాలిక రోడ్లు నిర్మించారు. కానీ అట‌వీశాఖ అధికారులు ప‌త్తి రైతుల‌కు ఆటంకాలు క‌లిగిస్తూ, రోడ్ల నిర్మాణానికి అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అట‌వీశాఖ ఉన్న‌తాధికారి ఒక‌రు మాట్లాడుతూ.. అట‌వీశాఖ అధికారుల అనుమ‌తి, ఆమోదం లేకుండానే ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాల‌కు భూములు కేటాయించ‌డం స‌రికాదు. త‌మ అనుమ‌తి తీసుకోవ‌డం తప్ప‌నిస‌రి. అట‌వీ భూముల‌ను కాపాడ‌డం త‌మ ప్రాథ‌మిక విధి అని ఆ అధికారి స్ప‌ష్టం చేశారు. అయితే ప్ర‌ధానంగా ఉమ్మ‌డి ఆదిలాబాద్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో త‌మ‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌న్నారు. అట‌వీ భూముల్లో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు విరుద్ధ‌మ‌ని తెలిపారు. క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్, అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్( Amrabad Tiger Reserve ) వంటి ప్రాంతాల్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌ను ఆ ప్రాంతాల‌ను త‌ర‌లించేందుకు అట‌వీశాఖ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. వారికి డ‌బ్బు లేదా వేరే ప్రాంతంలో భూమి కేటాయించి, వారిని త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇలాంటి త‌రుణంలో అట‌వీ భూముల్లో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు అనుమ‌తిస్తే.. అట‌వీ ఆక్ర‌మ‌ణ‌ల‌కు దారి తీస్తుంద‌న్నారు. వ‌న్య ప్రాణుల మ‌నుగ‌డ‌కు ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌ని స‌ద‌రు అట‌వీ శాఖ ఉన్న‌తాధికారి తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement