Telugu Serial Actor | పేరు మార్చుకున్న గుప్పెడంత మనసు సీరియల్ విలన్
స్టార్ మాలో టెలికాస్ట్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ పెద్ద హిట్టయ్యింది. ఈ సీరియల్‌లో శైలేంద్ర అనే పాత్రలో విలన్‌గా కనిపించాడు సురేష్ బాబు. అసలు పేరు కంటే శైలేంద్రనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. దాంతో తన స్క్రీన్ నేమ్‌ను శైలేంద్రకు మార్చుకుంటున్నట్లు సురేష్ బాబు ప్రకటించారు.
Entertainment | Published On Jan 1, 2026, 5.35 pm IST
Telugu Serial Actor | గుప్పెడంత మనసు స్టార్ మాలో సూపర్ హిట్ సీరియల్స్‌లో ఒకటిగా నిలిచింది. 2020లో లాంఛ్ అయిన ఈ సీరియల్ 2024 వరకు నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. ప్రారంభంలో టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గుప్పెడంత మనసు నుంచి హీరో రిషి క్యారెక్టర్ కొన్నాళ్లు తప్పుకోవడం, కథను సాగదీయడంతో సీరియల్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. 2024లో సరైన ముగింపు లేకుండానే అర్ధాంతరంగా గుప్పెడంత మనసుకు శుభంకార్డు వేశారు మేకర్స్.
రిషి...వసుధార...
ఈ సీరియల్‌లో రిషి, వసుధార క్యారెక్టర్లు, వారి ప్రేమకథ , క్రెమిస్ట్రీ బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాయి. ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఈ పాత్రలకు ప్రాణం పోశారు. నిజమైన ప్రేమికులు అని ఆడియెన్స్ ఫీలయ్యేలా నటించారు. వీరిద్దరితో పాటు గుప్పెడంత మనసులో సాయికిరణ్, జ్యోతి పూర్వజ్ కీలక పాత్రల్లో కనిపించారు. గుప్పెడంత మనసులో విలన్‌గా యాక్టర్ సురేష్‌బాబు నటించారు. శైలేంద్ర పాత్రలో తన విలనిజంతో మెప్పించారు. తాను కోరుకున్నది దక్కడ కోసం ఎలాంటి కుట్రలకు అయినా పాల్పడే వ్యక్తిగా కన్నింగ్ క్యారెక్టర్‌లో కనిపించారు. గుప్పెడంత మనసు సీరియల్ సురేష్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అసలు పేరు కంటే శైలేంద్రగానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఎక్కడికి వెళ్లినా అతడిని శైలేంద్ర అనే పిలుస్తున్నారట.
ఇక నుండి శైలేంద్రగానే...
దాంతో తన స్క్రీన్ నేమ్‌ను ఛేంజ్ చేసుకున్నారు సురేష్ బాబు. శైలేంద్ర పేరుతోనే ఇక నుంచి కొనసాగబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఇన్ని రోజులు సురేష్‌బాబుగా అభిమానించినట్లే ఇకపై శైలేంద్రగాకూడా ఆదరించాలని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.
ప్రస్తుతం నువ్వు లేక నేను లేను సీరియల్‌లో నటిస్తున్నాడు సురేష్‌బాబు. ఇటీవల స్టార్ మాలో ప్రారంభమైన ఈ సీరియల్‌లో లాయర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. మరోవైపు గుప్పెడంత మనసు సీరియల్‌కు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Guppedantha Manasu Jagathi | తెలుగు సినిమాలో హీరోయిన్గా గుప్పెడంత మనసు జగతి
ఏప్రిల్ 27, 2026

Gunde Ninda Gudi Gantalu Balu | స్టార్ మా కొత్త సీరియల్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు – ఫుల్ లెంగ్త్ కాదు…గెస్ట్‌గా…
జనవరి 11, 2026

Telugu Tv Serial | 13 ఏళ్లు టెలికాస్ట్ – నాలుగు వేల ఎపిసోడ్స్ – తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ టీవీ సీరియల్ ఇదే!
జనవరి 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



