Harish Rao | జర్నలిస్టులకు రెండు కార్డుల విధానం సరికాదు : హరీష్ రావు
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రతినిధులు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుని కలిసి వినతి పత్రం సమర్పించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( TUWJ ) ప్రతినిధులు ఈరోజు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుని హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు హరీష్ రావు దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. గతంలో ఉన్న జీవో 239 ప్రకారం సుమారు 23 వేల మందికి అక్రిడిటేషన్ కార్డులు లభించేవని, కానీ నూతన జీవో 252 వల్ల దాదాపు 13 వేల మంది జర్నలిస్టులు కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ముఖ్యంగా డెస్క్, బ్యూరో జర్నలిస్టులంటూ విభజించి, రెండు కార్డుల విధానాన్ని తీసుకురావడం వల్ల జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీసినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను గౌరవించాల్సింది పోయి వారిని అణచివేసేలా కొత్త నిబంధనలు తేవడం దుర్మార్గం. డెస్క్ జర్నలిస్టులకు వేరు రిపోర్టర్లకు వేరు అంటూ రెండు కార్డుల విధానం తీసుకురావడం జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టడమే. వార్తను ప్రజల వరకు చేర్చడంలో డెస్క్ జర్నలిస్టుల పాత్ర కూడా కీలకం. అలాంటి వారికి అక్రిడిటేషన్ ఇవ్వకుండా కేవలం గుర్తింపు కార్డు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవడం వారిని కించపరచడమే అని హరీశ్‌రావు మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా 23 వేల మందికి అక్రిడిటేషన్లు ఇచ్చి గౌరవించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 13 వేలకు కుదించాలని చూడటం అంటే.. దాదాపు 10 వేల మంది జర్నలిస్టులకు అన్యాయం చేయడమే. జర్నలిస్టుల సంఖ్యను తగ్గించి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది. కొత్త జీవో వల్ల జర్నలిస్టులు హెల్త్ కార్డులు, బస్ పాస్ సౌకర్యాలను కోల్పోయే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల, వారి ప్రయాణ సౌకర్యాల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు.
గతంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించి, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ ఇప్పుడు ఆ ప్రీమియం చెల్లించడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తూ అన్యాయం చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది. అందుకే కేసీఆర్ జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
జర్నలిస్టులకు అన్యాయం చేసే ఈ జీవోపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తానని హరీష్ రావు యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జీవో 252 సవరణ కోసం TUWJ చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, ప్రభుత్వానికి తగు సూచనలు చేసి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
హరీష్ రావును కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, కోశాధికారి పి.యోగనంద్, తెమ్జూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్షులు రాకేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ తదితరులు ఉన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



