త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anirudh Reddy | నేను స‌చ్చిపోతెనే బిల్లులిస్త‌రా? అట్ల‌యితే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగుతా

Anirudh Reddy | జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) సొంత ప్ర‌భుత్వంపైనే మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను చ‌నిపోతేనే రోడ్ల నిర్మాణ బిల్లులు (Road Constructions Bills) వ‌స్తాయంటే చావ‌డానికి సిద్ధ‌మేన‌ని వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 26, 2026, 3.49 pm IST

Anirudh Reddy | నేను స‌చ్చిపోతెనే బిల్లులిస్త‌రా? అట్ల‌యితే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగుతా
Advertisement
  • నా చావుకు రూ.40 కోట్ల విలువ‌నా? నేన్ బ‌త‌కాల్నో వ‌ద్దో ప్ర‌భుత్వ‌మే చెప్పాలి
  • భట్టన్న, కోమటిరెడ్డన్న రోడ్ల నిర్మాణానికి బిల్లులిస్త‌మ‌న్న‌రు
  • కొన్ని రోజుల కింద కాంట్రాక్ట‌ర్ స‌చ్చిపోతే బిల్లులిచ్చిర్రు.. మంత్రుల నియోజ‌క‌వ‌ర్గాల‌కూ ఇస్తున్న‌రు
  • సొంత ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్‌

Anirudh Reddy | త్రినేత్ర న్యూస్: జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) సొంత ప్ర‌భుత్వంపైనే మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను చ‌నిపోతేనే రోడ్ల నిర్మాణ బిల్లులు (Road Constructions Bills) వ‌స్తాయంటే చావ‌డానికి సిద్ధ‌మేన‌ని వ్యాఖ్యానించారు. నా చావుకు రూ.40 కోట్ల విలువ‌నా అని ప్ర‌శ్నించారు. తాను బ‌త‌కాల్నో వ‌ద్దో ప్ర‌భుత్వ‌మే చెప్పాల‌న్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్లు పూర్తి చేయ‌కుంటే 30 వేల మందితో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగుతాన‌ని హెచ్చరించారు. సోమ‌వారం మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలోని రంగారెడ్డి గూడ, గుండ్ల పొట్లపల్లితో పాటు పలు గ్రామాల్లో పర్యటించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని చెప్పార‌ని గుర్తు చేశారు.

అప్లికేష‌న్లు కూడా పెట్టిన‌..

కేవలం మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారాఠ‌? మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇటీవల ఓ కాంట్రాక్టర్ చనిపోతే ఆయనకు రూ.5 కోట్ల బిల్లు మంజూరు చేశారు. ‘అట్ల‌యితే నా నియోజకవర్గ పనుల బిల్లుల కోసం నేను స‌చ్చిపోతా. నా నియోజ‌క‌వ‌ర్గంలో నీటి కాల్వ‌లు, నీళ్లు వ‌చ్చేదాకా కొట్లాడుతా. అప్లికేష‌న్లు కూడా పెట్టిన‌. జ‌డ్చ‌ర్ల ప్ర‌జ‌లు అండ‌గా ఉండాలే.

స‌మానంగ అభివృద్ధి చ‌స్తెనే ప్ర‌భుత్వం ఉంట‌ది..

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. జడ్చర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు పార్టీలకు అతీతంగా పోరాడి నీటిని సాధించుకుంటాం. రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటానికైనా వెనుకాడేది లేదు. తన నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయిన, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనుల బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి అని అనిరుధ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement