త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Aruna | దేశ భ‌ద్ర‌త కోస‌మే స‌ర్.. యువ‌త ఉన్న‌త చ‌దువుల‌పై దృష్టి పెట్టాలి: ఎంపీ డీకే అరుణ

DK Aruna | స‌ర్ (SIR) అనేది దేశ భ‌ద్ర‌త కోస‌మేన‌ని.. దేశంలో అర్హులైన వారికే ఓటు హ‌క్కు ఉండాల‌ని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 29, 2026, 6.11 pm IST

DK Aruna | దేశ భ‌ద్ర‌త కోస‌మే స‌ర్.. యువ‌త ఉన్న‌త చ‌దువుల‌పై దృష్టి పెట్టాలి: ఎంపీ డీకే అరుణ
Advertisement

DK Aruna | త్రినేత్ర న్యూస్: స‌ర్ (SIR) అనేది దేశ భ‌ద్ర‌త కోస‌మేన‌ని.. దేశంలో అర్హులైన వారికే ఓటు హ‌క్కు ఉండాల‌ని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. యువ‌త ఉన్న‌త చ‌దువుల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. మ‌త్తుకు బానిసై మంచి జీవితాల‌ను చిత్తు చేసుకోవ‌ద్ద‌న్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో మేరా యువ భారత్ మహబూబ్‌నగర్, ఉద్భవ్ సేవా సంసద్ ఆధ్వర్యంలో గురువారం నిర్వ‌హించిన‌ “యువ సంసాద్” (Yuva Sansad) కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.

దేశం కోసం యువత నడుం బిగించాలని, ఉన్నత చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మత్తుకు బానిసై తమ అమూల్యమైన జీవితాలను చిత్తు చేసుకోవద్దని హితవు పలికారు. చాలా మంది ‘ఎస్ఐఆర్’ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిద్వారా అర్హులైన వాస్తవికులకు ఓటు హక్కు లభించి దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసం కాదని, కేవలం దేశ భద్రత కోసం మాత్రమే పనిచేస్తుందని అవగాహన కల్పించారు. కాగా మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ నినాదంతో పాటు ‘ఎస్ఐఆర్’పై యువతకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహించారు.

ఈ అవగాహన సదస్సులో పాలమూరు యూనివర్సిటీ వీసీ వీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్ బాబు, డీన్ మధుసూదన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ సెల్ అధికారి డాక్టర్ ప్రవీణా, జిల్లా యువజన అధికారి కోటా నాయక్, జాతీయ యువజన అవార్డు గ్రహీత శివకుమార్, ఉద్భవ్ సేవా సంసద్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ అర్జున్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement