త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan Kumar | రూ.700 కోట్ల ఆల‌య‌ ప్రాజెక్ట్‌.. 948 కోట్లెందుకైంది?

MLC Dasoju Sravan Kumar | మంచిరేవుల ఓంకారేశ్వ‌ర ఆల‌య ప్రాజెక్టు ఖ‌ర్చు రూ.700 కోట్లు ఉండ‌గా జీవో వ‌చ్చేస‌రికి రూ.948 కోట్ల‌కు ఎందుకు పెరిగింద‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Oct 12, 2026, 4.09 pm IST

MLC Dasoju Sravan Kumar | రూ.700 కోట్ల ఆల‌య‌ ప్రాజెక్ట్‌.. 948 కోట్లెందుకైంది?
Advertisement
  • అడుగు త‌వ్వ‌లే.. ఇట్కె పేర్చ‌లే.. రూ.250 కోట్లు ఎట్ల‌ పెరిగిన‌య్‌
  • అవి ఏ కాంట్రాక్ట‌ర్ క‌డుపు నింప‌డానికి?
  • ఆఖ‌రికి మ‌హా దేవుడి పేరిట కూడా దోపిడేనా?
  • సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్‌

MLC Dasoju Sravan Kumar | త్రినేత్ర న్యూస్‌: మంచిరేవుల ఓంకారేశ్వ‌ర ఆల‌య ప్రాజెక్టు ఖ‌ర్చు రూ.700 కోట్లు ఉండ‌గా జీవో వ‌చ్చేస‌రికి రూ.948 కోట్ల‌కు ఎందుకు పెరిగింద‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ప్ర‌శ్నించారు. అడుగు త‌వ్వ‌కున్నా.. ఇటుక పేర్చ‌కున్నా రూ.250 కోట్లు ఎందుకు పెంచార‌ని నిల‌దీశారు. ఆ డ‌బ్బులు ఏ కాంట్రాక్ట‌ర్ క‌డుపు నింప‌డానికని ధ్వ‌జ‌మెత్తారు. ఆఖ‌రికి మ‌హా దేవుడి పేరిట కూడా దోపిడేనా అని మండిప‌డ్డారు. ఈమేర‌కు సోమ‌వారం ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్ట్ పెట్టారు.

రేవంత్ రెడ్డి మార్క్ రూ.250 కోట్ల గోల్‌మాల్? ఒక్క అడుగు తవ్వలేదు. ఒక్క ఇటుక పేర్చలేదు. కానీ మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకాయి. రూ.700 కోట్ల ప్రాజెక్ట్ కాస్తా.. జీ వచ్చేసరికి ఆలయానికే రూ. 948.65 కోట్లు. రోడ్డు పనులతో కలిపి మొత్తం రూ.1,108.27 కోట్లకు చేరింది. ఇంత భారీగా అంచనాలు పెంచడం వెనుక ఉన్న మతలబు ఏంటి?

వెంట‌నే విచార‌ణ జ‌ర‌పాలి..

స్వ‌యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించే శాఖలోనే ఈ అడ్డగోలు పెంపు ఎవరి జేబులు నింపడానికో ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఆఖరికి మహాదేవుణ్ణి కూడా దోపిడీ చెస్తారా? దేవాలయాల పేరుతో సాగుతున్న ఈ అంచనాల దందా ఆరోపణలపై తక్షణమే బహిరంగ విచారణ జరిపించాలి అని దాసోజు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement