త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్‌లో 774 మంది న్యాయవాదులుగా నమోదు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ‌నివారం హైదరాబాద్‌లో నిర్వహించిన న్యాయవాదుల నమోదు, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొత్తం 774 మంది న్యాయ పట్టభద్రులు న్యాయవాదులుగా నమోదు అయ్యారు.

S

Telangana | Published On Oct 24, 2026, 6.58 pm IST

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్‌లో 774 మంది న్యాయవాదులుగా నమోదు
Advertisement

వృత్తిలో నిరంతర అధ్యయనం, క్రమశిక్షణ, నైతిక విలువలు ముఖ్యమన్న న్యాయ ప్రముఖులు

Telangana Bar Council | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ‌నివారం హైదరాబాద్‌లో నిర్వహించిన న్యాయవాదుల నమోదు, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొత్తం 774 మంది న్యాయ పట్టభద్రులు న్యాయవాదులుగా నమోదు అయ్యారు.

ఈ కార్యక్రమాన్ని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ లోకాయుక్త చైర్మన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించి, నూతనంగా నమోదు అయిన న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. న్యాయవాద వృత్తిలో నిరంతరం నేర్చుకోవడం, చట్టాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, తమ న్యాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ సామల రామిరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులు తమ వృత్తిని నిర్వహించే సమయంలో వృత్తి గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. న్యాయవాద వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు.

తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి న్యాయవాది అడ్వకేట్స్ చట్టం (Advocates Act) నిబంధనలను, వృత్తికి సంబంధించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా వృత్తిలో ప్రారంభించిన మొదటి మూడు నుంచి ఐదు సంవత్సరాలు ప్రతి న్యాయవాదికి ఎంతో కీలకమని అన్నారు. ఈ సమయంలో సీనియర్ న్యాయవాదుల వద్ద వృత్తిపరమైన మెళకువలు నేర్చుకోవడం, చట్టాలపై పట్టు సాధించడం, కోర్టు విధానాలను అర్థం చేసుకోవడం, వృత్తి నైతిక విలువలను పాటించడం ద్వారా మంచి న్యాయవాదిగా ఎదగవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు దన్వాడ మధుసూధన్ రావు, శ్రీనివాస్ రావు మందాడపు, శ్రీ రాఘవులు పాల్గొని, నూతన న్యాయవాదులకు వృత్తిపరమైన నైతిక విలువలు, కోర్టు విధానాలు, న్యాయవాదుల బాధ్యతలపై పలు సూచనలు అందించారు. న్యాయవాదులు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, న్యాయవ్యవస్థ పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని, తమ క్లయింట్ల హక్కులను కాపాడాలని, వృత్తి గౌరవాన్ని నిలబెట్టాలని ఈ సందర్భంగా వక్తలు సూచించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యదర్శి నాగ లక్ష్మి సమన్వయం చేశారు.

Advertisement
Advertisement