త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCI | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే

BCI | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మ‌న్ నిర్ణ‌యాల‌పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( BCI ) స్టే విధించింది. ఈ మేర‌కు బీసీఐ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై బీసీఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

S

Telangana | Published On Oct 23, 2026, 5.31 pm IST

BCI | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే
Advertisement

BCI | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మ‌న్ నిర్ణ‌యాల‌పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( BCI ) స్టే విధించింది. ఈ మేర‌కు బీసీఐ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై బీసీఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కమిటీల ఏర్పాటులో చట్ట నిబంధనలు పాటించాలని ఆదేశించింది. వివాదాస్పద కమిటీల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణపై మధ్యంతర స్టే విధించింది.

అక్టోబర్ 11 జనరల్ బాడీ సమావేశం మినిట్స్‌పై ఫిర్యాదుల పరిశీలించి.. సభ్యుల అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు నమోదు చేయలేదని పేర్కొంది. నిర్దేశిత గడువులోగా వివరణలు, సంబంధిత రికార్డులు సమర్పించాలని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, కార్యదర్శికి బీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

న్యాయవాదుల ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌త్యేక కమిటీలో చైర్మన్, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణకు చెందిన బీసీఐ సభ్యుడికి అవ‌కాశం క‌ల్పించాల‌ని సూచించింది. అడ్వకేట్స్ యాక్ట్–1961 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. పారదర్శకత, ప్రజాస్వామ్య విధానాల అమలుపై దృష్టి సారించాల‌ని సూచించింది.

Advertisement
Advertisement