Sridhar Babu | ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయవాదులంతా మద్దతుగా నిలవాలి
Sridhar Babu | రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయవాదులంతా ఎన్‌రోల్‌మెంట్ చేయించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) కోరారు.
- సామ రామ్మోహన్‌రెడ్డి స్వయాన అడ్వకేట్
- మీ అందరికీ ఇందిరమ్మ ప్రమాద బీమా అమలు చేస్తాం
- గాంధీ భవన్ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు
Sridhar Babu | త్రినేత్ర న్యూస్: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయవాదులంతా ఎన్‌రోల్‌మెంట్ చేయించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) కోరారు. పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి స్వయాన అడ్వకేట్ అని.. ఆయనకు అండగా ఉండి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులందరికీ ఇందిరమ్మ ప్రమాద బీమా అమలు చేస్తామన్నారు. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. గాంధీ భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
వివిధ కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాద సోదరులు, సోదరీమణులు, ఇప్పుడే ఎన్‌రోల్ చేసుకొని గొప్ప న్యాయవాదులుగా ఎదగాలని ఆలోచిస్తున్న యువ మిత్రులందరికీ ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. మధుయాష్కీ గౌడ్ కేంద్ర స్థాయిలో పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం మొదటిసారిగా పార్లమెంట్ సభ్యులుగా పోరాటాలు చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు.
అదే స్ఫూర్తితో కృషి చేయాలి
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి న్యాయవాదులందరూ ఒకే తాటిపైకి వచ్చి విజయానికి కృషి చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో సైనికులా పని చేసి పార్టీ విజయానికి కృషి చేయాలి. గతంలో వామనరావు దంపతుల హత్య జరిగినప్పుడు ఇచ్చిన హామీ మేరకు, న్యాయవాదుల భద్రత కోసం అసెంబ్లీలో 'అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్' తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపింది.
లా డిపార్ట్‌మెంట్ కూడా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నందున, న్యాయవాదుల సంక్షేమం, కార్పస్ ఫండ్ పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే మంత్రులు, అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తాం. GP, AGP, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్సిల్ పోస్టుల భర్తీపై సీఎం కసరత్తు చేస్తున్నారు, అదే సమయంలో వారి పనితీరుపై 'పెర్ఫార్మెన్స్ ఆడిట్' పారామీటర్లు పెట్టి సమీక్షించాలని ఆలోచిస్తున్నారు. ఈ నియామకాల్లో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు అసోసియేషన్ సహకారం అవసరం.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్‌కు సంబంధించిన కటాఫ్ మార్కుల అంశాన్ని లా సెక్రటరీ, సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయపరంగా పరిష్కరిస్తాం. 33 జిల్లాల్లో పార్టీ న్యాయవాదులు క్రియాశీలకంగా ఉంటూ, ఫీజులు భరించలేని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలవాలి. భవిష్యత్తులో వారికి తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయి.
ఢిల్లీ ప్రయాణ, వసతి ఏర్పాట్లు మావే..
నవంబర్ 1న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఢిల్లీలో జరిగే భారీ కార్యక్రమానికి తెలంగాణ నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. ఢిల్లీ వచ్చే వారికి ప్రయాణ, వసతి ఏర్పాట్లను చూసుకుంటాం అని శ్రీధర్‌బాబు వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Candle Making Business | ఇంట్లోనే క్యాండిల్స్ తయారీ.. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయానికి అవకాశం..
- ●Talasani Srinivas Yadav | పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోండి
- ●ED Raids | హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
- ●Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవలలు మృతి
- ●Vijay Deverakonda | బాధ్యతతో చేసిన సినిమా - డబ్బులు, అవార్డులు ఇవ్వని తృప్తి ఇచ్చింది - "రణబాలి"పై విజయ్ దేవరకొండ కామెంట్స్
- ●Debt Repayment | అప్పులు తీర్చాలా? పెట్టుబడులు పెట్టాలా? ఏది ముందు చేయాలి..?

Candle Making Business | ఇంట్లోనే క్యాండిల్స్ తయారీ.. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయానికి అవకాశం..

Talasani Srinivas Yadav | పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోండి

ED Raids | హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవలలు మృతి






