త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gajwel SI Mallareddy | రైతుపై దాడి.. గ‌జ్వేల్ ఎస్ఐ మ‌ల్లారెడ్డిపై వేటు

Gajwel SI Mallareddy | ఓ యువ రైతుపై దాడికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో గ‌జ్వేల్ టౌన్ ఎస్ఐ మ‌ల్లారెడ్డి( Gajwel SI Mallareddy ) పై వేటు ప‌డింది. స‌ద‌రు ఎస్ఐపై ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. సీఏఆర్ హెడ్ క్వార్ట‌ర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట సీపీ అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

S

Telangana | Published On Oct 24, 2026, 6.39 pm IST

Gajwel SI Mallareddy | రైతుపై దాడి.. గ‌జ్వేల్ ఎస్ఐ మ‌ల్లారెడ్డిపై వేటు
Advertisement

Gajwel SI Mallareddy | త్రినేత్ర న్యూస్ : ఓ యువ రైతుపై దాడికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో గ‌జ్వేల్ టౌన్ ఎస్ఐ మ‌ల్లారెడ్డి( Gajwel SI Mallareddy ) పై వేటు ప‌డింది. స‌ద‌రు ఎస్ఐపై ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. సీఏఆర్ హెడ్ క్వార్ట‌ర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట సీపీ అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఘ‌ట‌న‌ప గ‌జ్వేల్ ఏసీపీ న‌ర్సింహులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

గజ్వేల్ పరిధిలోని గిరిపల్లికి చెందిన బీమ‌రి రవికి బోరు మోటారు నీటి వినియోగం విషయంలో బంధువులతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో బంధువులు దాడి చేయడంతో రవికి గాయాలయ్యాయి. దీంతో తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు రవి గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రవిపై ఎస్‌ఐ మల్లారెడ్డి దాడి చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐ చెంపపై కొట్టడంతో రవి కంటికి గాయమై రక్తస్రావం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement