త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Basheer Bagh Chowrasta | బ‌షీర్‌బాగ్ చౌర‌స్తాలో శ్రీరాముడి విగ్ర‌హం తొల‌గింపు

Basheer Bagh Chowrasta | హైద‌రాబాద్ న‌గ‌రంలోని బషీర్‌బాగ్ చౌరస్తా( Basheer Bagh Chowrasta )లో ఏర్పాటు చేసిన శ్రీరాముడి( Lord Srirama ) విగ్రహాన్ని అధికారులు శనివారం తొలగించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి.. లారీలోకి ఎక్కించారు.

S

Hyderabad | Published On Oct 24, 2026, 6.08 pm IST

Basheer Bagh Chowrasta | బ‌షీర్‌బాగ్ చౌర‌స్తాలో శ్రీరాముడి విగ్ర‌హం తొల‌గింపు
Advertisement

Basheer Bagh Chowrasta | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని బషీర్‌బాగ్ చౌరస్తా( Basheer Bagh Chowrasta )లో ఏర్పాటు చేసిన శ్రీరాముడి( Lord Srirama ) విగ్రహాన్ని అధికారులు శనివారం తొలగించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి.. లారీలోకి ఎక్కించారు. ఈ పరిణామంతో బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద తీవ్ర ఉద్రిక్తత నెల‌కొంది. విగ్రహం తొలగింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

అక్టోబ‌ర్ 20న ద‌సరా పండుగను పుర‌స్క‌రించుకొని బ‌షీర్‌బాగ్ చౌర‌స్తాలో ఉన్న అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద శ్రీరాముడి విగ్ర‌హాన్ని భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ రావినూత‌ల శ‌శిధ‌ర్ ఏర్పాటు చేశారు. ఇక నుంచి బ‌షీర్‌బాగ్ చౌర‌స్తాను శ్రీరామ్ చౌక్‌గా పిలవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

శ‌శిధ‌ర్ ప్ర‌క‌ట‌న‌పై మ‌జ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) నాయ‌కులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బ‌షీర్‌బాగ్ చౌర‌స్తాలో శ్రీరాముడి విగ్ర‌హ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ, సిటీ పోలీసుల అనుమ‌తి తీసుకున్నారా..? అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి అనుమ‌తి లేకుండా విగ్ర‌హాలు ఏర్పాటు చేసి, చౌర‌స్తాల పేర్లు మార్చేస్తారా..? అని అడిగారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శ‌నివారం అధికారులు శ్రీరాముడి విగ్ర‌హాన్ని అక్క‌డ్నుంచి త‌ర‌లించారు.

Advertisement
Advertisement