త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | నామినేటెడ్ పోస్టుల్లో అడ్వ‌కేట్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తాం

Ponnam Prabhakar | కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డ్డ అడ్వ‌కేట్ల‌కు ప్ర‌భుత్వంలో స‌ముచితం స్థాన క‌ల్పిస్తామ‌ని, అవ‌స‌ర‌మైతే నామినేటెడ్ పోస్టుల్లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.

S

Telangana | Published On Oct 24, 2026, 3.45 pm IST

Ponnam Prabhakar | నామినేటెడ్ పోస్టుల్లో అడ్వ‌కేట్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తాం
Advertisement

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సామ రామ్మోహ‌న్ రెడ్డిని గెలిపించండి
అడ్వ‌కేట్ల‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ విజ్ఞ‌ప్తి

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డ్డ అడ్వ‌కేట్ల‌కు ప్ర‌భుత్వంలో స‌ముచితం స్థాన క‌ల్పిస్తామ‌ని, అవ‌స‌ర‌మైతే నామినేటెడ్ పోస్టుల్లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తోటి న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కృషి చేయాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. ఇందిరా భవన్‌లో టీ పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, ఏఐసిసి ఫ్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రావడంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది. 2023లో ప్రజా పాలన ప్రభుత్వం రావడంలో మీరు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన అడ్వకేట్‌ల‌కు సంబంధించి సముచిత న్యాయం జరగాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అనుబంధ వారికి అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ లోని 33 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి.. అక్కడ అడ్వకేట్స్ పార్టీకి సంబంధించిన లీగల్ ఇష్యూస్‌కి అండగా ఉండాలి. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై కూడా పార్టీ లీగల్ సెల్ అండగా ఉండాలి. పార్టీ కార్యకర్తలకు ప్రొటెక్ట్ చేసే సమయంలో లీగల్ అండగా ఉండాలి. ఎల్క‌తుర్తి లాంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం కోర్టులు ఏర్పాటు చేసింది అని మంత్రి తెలిపారు.

న్యాయపరమైన పదవుల్లో కాంగ్రెస్ వారికి అవకాశాలు ఇవ్వడం.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడంలో, న్యాయవాదుల సమస్యలు పరిష్కారం చేయడంలో, వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు.

Advertisement
Advertisement