త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | భ‌ర్తతో బాక్సాఫీస్ ఫైట్ – అక్కినేని కోడ‌లి త‌మిళ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?

భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో బాక్సాఫీస్ ఫైట్‌కు అక్కినేని కోడ‌లు శోభిత ధూళిపాళ రెడీ అవుతోన్న‌ట్లు స‌మాచారం. శోభిత ధూళిపాళ ప్ర‌స్తుతం త‌మిళంలో వెట్టువ‌మ్ పేరుతో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ చేస్తోంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబ‌ర్ 4న నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ కూడా రిలీజ్ అవుతోంది. భార్యాభ‌ర్త‌ల సినిమాలు ఒకే రోజు థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయ‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Oct 24, 2026, 6.23 pm IST

Sobhita Dhulipala | భ‌ర్తతో బాక్సాఫీస్ ఫైట్ – అక్కినేని కోడ‌లి త‌మిళ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?
Advertisement

Sobhita Dhulipala | భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో అక్కినేని కోడ‌లు శోభిత ధూళిపాళ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతుంది. ఒకే రోజు భార్యాభ‌ర్త‌ల సినిమాలు థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. పెళ్లి త‌ర్వాత సినిమాల‌ను త‌గ్గించింది శోభిత ధూళిపాళ‌. గ్లామ‌ర్ రోల్స్‌కు పూర్తిగా దూరంగా ఉంటోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో వెట్టువ‌మ్ పేరుతో ఓ సినిమా చేస్తోంది. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నెగెటివ్ రోల్‌లో...

ఈ కోలీవుడ్ మూవీలో ర‌థి అనే అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్‌లో శోభిత ధూళిపాళ క‌నిపించ‌బోతుంది. నెగెటివ్ షేడ్స్‌తో యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఈ పాత్ర కోసం మ‌ల్ల‌ఖంభం, అది మురై క‌ల‌రిప‌య‌ట్టు వంటి ప్రాచీన యుద్ధ క‌ళల‌ను నేర్చుకుంది. ఈ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. డూప్ లేకుండా ఫైట్స్ చేసిన‌ట్లు చెప్పింది.

డిసెంబ‌ర్‌లో..

వెట్టువ‌మ్ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 4ను రిలీజ్ డేట్‌గా ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అదే డేట్‌కు నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.
ఒకే రోజు నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ న‌టించిన వేర్వేరు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. భ‌ర్త సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌స్ట్ టైమ్ శోభిత పోటీప‌డ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.

75 కోట్ల బ‌డ్జెట్‌...

వెట్టువ‌మ్‌లో ఆర్య‌, దినేష్ హీరోలుగా న‌టిస్తోన్నారు. దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో పా రంజిత్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా ఈ త‌మిళ మూవీ తెర‌కెక్కుతోంది. మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌ర్వాత శోభిత ధూళిపాళ త‌మిళంలో చేస్తోన్న సినిమా ఇది.

 

Advertisement
Advertisement