త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నిరుద్యోగుల‌ను అరెస్టు చేయ‌డం సిగ్గుచేటు : హ‌రీశ్‌రావు

Harish Rao | రాష్ట్రంలో ఏఈఈ( AEE ) రాత‌ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసేందుకు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాల‌ని ప్రతిపక్ష నేతలను కలిసి వినతిపత్రం ఇచ్చినందుకు విద్యార్థి, నిరుద్యోగులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 24, 2026, 5.42 pm IST

Harish Rao | నిరుద్యోగుల‌ను అరెస్టు చేయ‌డం సిగ్గుచేటు : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో ఏఈఈ( AEE ) రాత‌ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసేందుకు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాల‌ని ప్రతిపక్ష నేతలను కలిసి వినతిపత్రం ఇచ్చినందుకు విద్యార్థి, నిరుద్యోగులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) మండిప‌డ్డారు.

ఒకే రోజు SSC, TGPSC AEE పరీక్షలు ఉండటంతో నష్టపోతున్నామని, AEE పరీక్ష వాయిదా వేయాలని కోరడమే వారు చేసిన తప్పా అని రేవంత్ రెడ్డిని నిల‌దీశారు. మీ పంతాలు, పట్టింపుల కంటే నిరుద్యోగుల భవిష్యత్తే ముఖ్యం. భేషజాలకు పోయి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, AEE పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement