త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raithu Garjana Sabha | న‌వంబ‌ర్ 1న బీఆర్ఎస్ రైతు గ‌ర్జ‌న స‌భ‌

Raithu Garjana Sabha | రాష్ట్రంలోని అన్న‌దాత‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలువునా మోసం చేసింద‌ని మాజీ మంత్రి జోగు రామ‌న్న( Jogu Ramanna ) మండిప‌డ్డారు. క‌రువుతో రైతులు త‌ల్ల‌డిల్లిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాను క‌రువు పీడిత జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ న‌వంబ‌ర్ 1వ తేదీన రైతు గ‌ర్జ‌న స‌భ( Raithu Garjana Sabha ) నిర్వ‌హిస్తున్న‌ట్లు జోగు రామ‌న్న ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Oct 24, 2026, 6.25 pm IST

Raithu Garjana Sabha | న‌వంబ‌ర్ 1న బీఆర్ఎస్ రైతు గ‌ర్జ‌న స‌భ‌
Advertisement

Raithu Garjana Sabha | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని అన్న‌దాత‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలువునా మోసం చేసింద‌ని మాజీ మంత్రి జోగు రామ‌న్న( Jogu Ramanna ) మండిప‌డ్డారు. క‌రువుతో రైతులు త‌ల్ల‌డిల్లిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాను క‌రువు పీడిత జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ న‌వంబ‌ర్ 1వ తేదీన రైతు గ‌ర్జ‌న స‌భ( Raithu Garjana Sabha ) నిర్వ‌హిస్తున్న‌ట్లు జోగు రామ‌న్న ప్ర‌క‌టించారు. ఆదిలాబాద్ జిల్లాలోని డైట్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వ‌హించే ఈ స‌భ‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌రవుతార‌ని తెలిపారు.

ఎల్ నినో కార‌ణంగా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని జోగు రామ‌న్న పేర్కొన్నారు. రైతుల‌ను ఆదుకోవాల‌ని బీఆర్ఎస్ పార్టీ విజ్ఞ‌ప్తి చేసిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. క‌రువు కార‌ణంగా పంట న‌ష్టం జ‌ర‌గ‌డంతో రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఆదిలాబాద్‌ను కరువు పీడిత జిల్లాగా ప్రకటించి, పంట న‌ష్ట‌పోయిన‌ రైతులకు అండగా నిలిచేందుకు తక్షణ సహాయక చర్యలు చేప‌ట్టాల‌ని మాజీ మంత్రి కోరారు. కరువుతో దెబ్బతిన్న రైతులకు సహాయం చేసే విషయంలో పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాల‌న్నారు. మహారాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతి రైతుకు రూ. 5,000 అందించిన విషయాన్ని జోగు రామ‌న్న గుర్తు చేశారు.

Advertisement
Advertisement