త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balmuri Venkat | 75 శాతం కానిస్టేబుల్ పోస్టులు ఆదివాసీల‌కు కేటాయించాలి: బ‌ల్మూరి వెంక‌ట్‌

Balmuri Venkat | ఏజెన్సీల్లోని ఆదివాసీ అభ్య‌ర్థుల‌కు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 75 శాతం కేటాయించాల‌ని ఎమ్మెల్సీ, ప్ర‌భుత్వ విప్ డాక్ట‌ర్ బల్మూరి వెంక‌ట్ కోరారు. ఈవెంట్స్ లో లాంగ్ జంప్ అర్హత ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఉన్న విధంగా స‌డ‌లించాల‌న్నారు.

S

Telangana | Published On Sep 11, 2026, 6.01 pm IST

Balmuri Venkat | 75 శాతం కానిస్టేబుల్ పోస్టులు ఆదివాసీల‌కు కేటాయించాలి: బ‌ల్మూరి వెంక‌ట్‌
Advertisement

Balmuri Venkat | త్రినేత్ర‌.న్యూస్‌: ఏజెన్సీల్లోని ఆదివాసీ అభ్య‌ర్థుల‌కు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 75 శాతం కేటాయించాల‌ని ఎమ్మెల్సీ, ప్ర‌భుత్వ విప్ డాక్ట‌ర్ బల్మూరి వెంక‌ట్ కోరారు. ఈవెంట్స్ లో లాంగ్ జంప్ అర్హత ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఉన్న విధంగా స‌డ‌లించాల‌న్నారు. రాష్ట్రంలో పురుష అభ్యర్థులకు 4 మీటర్ల నుంచి, 3.8 మీటర్ల వరకు, మహిళా అభ్యర్థులకు 2.5 మీటర్ల నుంచి 2.3 మీటర్లకు తగ్గించాలని విజ్ఞ‌ప్తి చేశారు. శుక్ర‌వారం శాసనమండలిలో పోలీసు రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల సమస్యలను ఆయ‌న‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

గతంలో విధంగా 75% సివిల్ కానిస్టేబుల్ పోస్టులు స్థానిక ఆదివాసీల‌కు కేటాయించాలి. లాంగ్ జంప్‌లో సడలింపులు, ఇవ్వాలి. పోలీసు నియామకాల్లో వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని జీవో ఇవ్వడం సంతోష‌క‌రం. ముఖ్యమంత్రి, ప్రజా ప్రభుత్వానికి నిరుద్యోగుల పక్షాన కృతజ్ఞతలు అని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement
Advertisement