Karimnagar | చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చుకున్నాడు..
Karimnagar | అనారోగ్యంతో దవాఖానలో చేరిన వ్యక్తిని చనిపోయాడని (Passed Away) వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల (Final Rites) కోసం అంబులెన్సులో గ్రామానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అతడు లేచి కూర్చున్నాడు.
Karimnagar | త్రినేత్ర న్యూస్: అనారోగ్యంతో దవాఖానలో చేరిన వ్యక్తిని చనిపోయాడని (Passed Away) వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల (Final Rites) కోసం అంబులెన్సులో గ్రామానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అతడు లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యానికి గురైన వారు హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఈ ఘటన కరీంగనర్‌లో (Karimnagar) చోటుచేసుకుంది.
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన శంకరయ్య (66) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఈనెల 24న కుటుంబ సభ్యులు ఆయనను సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనతో కరీంనగర్‌లోని ఓ పైవ్రేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ఈనెల 25న శంకరయ్య మృతిచెందాడని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో (Ambulance) స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయనలో కదలికలు కనిపించాయి.
లేచి కూర్చున్న శంకరయ్యను వెంటనే వేములవాడలోని (Vemulawada) ఓ పైవ్రేట్ దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ప్రస్తుత హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు శంకరయ్య మృతి చెందాడనే సమాచారంతో గ్రామంలో ఉన్న బంధువులు అంత్యక్రియల కోసం ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. తండ్రి మరణించాడని సమాచారం అందడంతో శంకరయ్య ఇద్దరు కుమారులు దుబాయ్ (Dubai) నుంచి స్వగ్రామానికి బయలుదేరారు.
తాజావార్తలు
- ●Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక: ప్రియదర్శి ధన్యవాదాలు
- ●KTR | కాంగ్రెస్ బీజేపీ అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి రెండేండ్లు: కేటీఆర్
- ●Kavitha | జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంతుకమ్మ వేడుకలు: కవిత
- ●Short Circuit | పేలిన ప్రిజ్.. కాలి బూడిదైన రూ.20 లక్షల నగదు
- ●Border Trade | టిబెట్‌లో భారీగా హిమపాతం.. భారత్-చైనా సరిహద్దుల్లో నిలిచిన వాణిజ్యం
- ●Tyre Burst | హైవేపై కారు టైర్ పంచర్.. ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో

Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక: ప్రియదర్శి ధన్యవాదాలు

KTR | కాంగ్రెస్ బీజేపీ అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి రెండేండ్లు: కేటీఆర్

Kavitha | జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంతుకమ్మ వేడుకలు: కవిత

Short Circuit | పేలిన ప్రిజ్.. కాలి బూడిదైన రూ.20 లక్షల నగదు






