Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
Revanth Reddy | దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం మంది లబ్ధిదారులు దళితులే అని తెలిపారు.
- అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించాలి
- అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోంది
- జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నాం
- స్టేట్ లెవల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం మంది లబ్ధిదారులు దళితులే అని తెలిపారు. అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో స్టేట్ లెవల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం 1989 అమలుపై చర్చించారు.
ఎస్టీలకు 17 శాతం ఇండ్లు..
సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను దళితులు ఇప్పటికీ మరిచిపోలేదు. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీది. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. బడ్జెట్ లో జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నాం. ప్రభుత్వం ఈ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఇందిరమ్మ ఇండ్లల్లో 31 శాతం లబ్ధిదారులు దళితులే. ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం.
రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం. రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి తెలంగాణలో సన్న బియ్యం అందిస్తున్నాం. సన్న బియ్యంతో దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నాం. దళితులు, గిరిజనులు, ఆదివాసీలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోంది. బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్ తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్ లో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా.
చదువొక్కటే జీవితాలను మారుస్తుంది. అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్య పరిష్కారం కాదు. పిల్లల్ని చదువు, క్రీడల వైపు ప్రోత్సహించండి. రాజకీయాలకు అతీతంగా ఈ వర్గాల అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రభుత్వం మీది.. మీకోసం పని చేస్తుంది.
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013, ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన చట్టం అమలుపై స్టేట్ లెవల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించగా ఈరోజు తొలిసారి తెలంగాణలో నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం, పునరావాసంపై సమీక్షలో సీఎం మాట్లాడారు. చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళి నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..
- ●Brahmotsavam 2026 | భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం
- ●Abortion | అబార్షన్ విషయంలో మహిళదే తుది నిర్ణయం.. బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు
- ●NYTTA | న్యూయార్క్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు
- ●Ranabaali | చూడముచ్చటగా విజయ్, రష్మిక కెమిస్ట్రీ - రణబాలి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక

OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Brahmotsavam 2026 | భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం

Abortion | అబార్షన్ విషయంలో మహిళదే తుది నిర్ణయం.. బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు





