త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaddu Ki Kheer | పెండ్లి వేడుక‌లో మిగిలిన పాయ‌సం తిని.. 30 మందికి అస్వ‌స్థ‌త‌

Kaddu Ki Kheer | పెండ్లి విందులో మిగిలిన పాయ‌సాన్ని ((Kaddu Ki Kheer) ).. ఇరుగు పొరుగువారికి పంచారు. దీంతో దానిని తిన్న వారు అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో (Mahabubnagar) చోటుచేసుకున్న‌ది.

G

Telangana | Published On Jun 28, 2026, 9.26 am IST

Kaddu Ki Kheer | పెండ్లి వేడుక‌లో మిగిలిన పాయ‌సం తిని.. 30 మందికి అస్వ‌స్థ‌త‌
Advertisement

Kaddu Ki Kheer | త్రినేత్ర‌.న్యూస్‌: పెండ్లి విందులో మిగిలిన పాయ‌సాన్ని ((Kaddu Ki Kheer) ).. ఇరుగు పొరుగువారికి పంచారు. దీంతో దానిని తిన్న వారు అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో (Mahabubnagar) చోటుచేసుకున్న‌ది. జిల్లా కేంద్రంలోని న్యూమారుతీ న‌గ‌ర్‌కు చెందిన ఓ వ్య‌క్తి పెండ్లి (Wedding Celebration) స్థానికంగా ఓ ఫంక్ష‌న్ హాల్‌లో జ‌రిగింది. విందులో భాగంగా చేసిన కద్దు కా కీర్ పాయసం మిగిలిపోయింది. దీంతో మిగిలిన పాయసాన్ని తెల్లారి మ‌ధ్యాహ్నం కాలనీ వాసులకు పంచారు.

దీంతో దానిని తిన్న కాలనీ వాసులు, బంధువులు కొద్దిసేపటికే వాంతులు చేసుకున్నారు. సుమారు 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. 13 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవాళ్లు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతుండ‌గా, మిగిలిన‌వారు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. దీనికి ఫుడ్ పాయిజ‌నే ( Food Poison) కార‌ణ‌మ‌ని అధికారులు తెలిపారు.

 

Advertisement
Advertisement