Argentina vs Jordan | అర్జెంటినా హ్యాట్రిక్
Argentina vs Jordan | ప్రపంచకప్ గ్రూప్-జేలో చివరి మ్యాచులు ఉత్కంఠభరితంగా ముగిశాయి. లియోనెల్ మెస్సీ మరో అరుదైన ప్రపంచకప్ రికార్డును తన పేరిట లిఖించుకోగా.. అర్జెంటీనా గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రియా–అల్జీరియా మధ్య జరిగిన 3-3 మ్యాచ్ డ్రా ఇరు జట్లను నాకౌట్ దశకు చేర్చగా.. ఇరాన్ ప్రపంచకప్ ప్రయాణానికి తెరపడింది.
- జోర్డాన్‌పై 1-3 తేడాతో ఘన విజయం
- సరికొత్త రికార్డును నెలకొల్పిన మెస్సీ
- నాకౌట్‌లో కేప్‌వెర్డేతో ఢీ
- ఇరాన్‌కు నిరాశ
Argentina vs Jordan | ప్రపంచకప్ గ్రూప్-జేలో చివరి మ్యాచులు ఉత్కంఠభరితంగా ముగిశాయి. లియోనెల్ మెస్సీ మరో అరుదైన ప్రపంచకప్ రికార్డును తన పేరిట లిఖించుకోగా.. అర్జెంటీనా గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రియా–అల్జీరియా మధ్య జరిగిన 3-3 మ్యాచ్ డ్రా ఇరు జట్లను నాకౌట్ దశకు చేర్చగా.. ఇరాన్ ప్రపంచకప్ ప్రయాణానికి తెరపడింది. గ్రూప్–జేలో అర్జెంటీనా తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రియా రెండో స్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్ 32కు చేరగా.. అల్జీరియా అత్యుత్తమ మూడో స్థాన జట్లలో ఒకటిగా నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది. చివరి క్షణాల్లో ఆస్ట్రియా సాధించిన ఫలితంతో సమీకరణాలు మారిపోయాయి. దాంతో ఇరాన్ ఆశలు ఆవిరయ్యాయి.
మెస్సీ ఖాతాలో మరో ప్రపంచకప్ రికార్డు
ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా, జోర్డాన్‌పై 3-1తో విజయం సాధించి గ్రూప్ దశను విజయవంతంగా ముగించింది. కోచ్ లియోనెల్ స్కలోనీ జట్టులో తొమ్మిది మార్పులు చేసినా, అర్జెంటీనా ఆధిపత్యం ఏమాత్రం తగ్గలేదు. 19వ నిమిషంలో జియోవాని లో సెల్సో అద్భుతమైన ఫ్రీకిక్‌తో అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ కాకుండా గోల్ చేసిన తొలి అర్జెంటీనా ఆటగాడిగా నిలిచాడు. అనంతరం లౌటారో మార్టినెజ్ పెనాల్టీ ద్వారా రెండో గోల్ సాధించాడు. రెండో అర్ధభాగంలో బరిలోకి దిగిన మెస్సీ, 80వ నిమిషంలో తనదైన శైలిలో గోల్ నమోదు చేశాడు. ప్రపంచకప్‌లలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే, ప్రపంచకప్‌లో మొత్తం గోల్స్ సంఖ్య 19కు చేరింది. ఈ ఘనతతో ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్ ఫాంటెయిన్, బ్రెజిల్ దిగ్గజం జైర్జిన్యో రికార్డులను అధిగమించాడు. చివర్లో జోర్డాన్ ఒక గోల్ చేసినా.. అర్జెంటీనా విజయంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. రౌండ్ ఆఫ్ 32లో అర్జెంటీనా కేప్‌వెర్డేతో తలపడనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Eatala Rajender | ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తున్న హైడ్రా: ఎంపీ ఈటల రాజేందర్
- ●Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్
- ●పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా
- ●Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో
- ●Croatia vs Ghana | నాకౌట్లోకి క్రొయేషియా
- ●Kaddu Ki Kheer | పెండ్లి వేడుకలో మిగిలిన పాయసం తిని.. 30 మందికి అస్వస్థత

Eatala Rajender | ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తున్న హైడ్రా: ఎంపీ ఈటల రాజేందర్

Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్

పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా

Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో




