Kesineni Nani | హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న విజయవాడ ఎంపీ.. సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు
Kesineni Nani | ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ టీడీపీ ఎంపీ (Vijayawada MP).. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు (Land Grabing) యత్నిస్తున్నాడని మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) లేఖ రాశారు.
Kesineni Nani | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ టీడీపీ ఎంపీ (Vijayawada MP).. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు (Land Grabing) యత్నిస్తున్నాడని మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) లేఖ రాశారు. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Chinni) కుటుంబం, ఆయన బినామీ సంస్థ ఆక్రమించేందుకు చూస్తున్నదని మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని (Kesineni Nani) ఫిర్యాదు చేశారు.
కూకట్‌పల్లి సమీపంలోని శంషీగూడ (Shamshiguda) వద్ద ఐటీ పార్కు (IT Park) కోసం టీజీఐఐసీ (TGIIC) కేటాయించిన దాదాపు 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి కేశినేని చిన్ని, ఆయన బినామీ సంస్థ అయిన మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ (M/s Exella Properties) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆ ప్రయత్నాన్ని వెంటనే అండ్డుకోవాలని కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇచ్చిన పాత ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, నకిలీ లీగల్ సెటిల్‌మెంట్లతో నిందితులు ఏకంగా సుప్రీంకోర్టును (Supreme Court) తప్పుదోవ పట్టించారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈ ఐటీ పార్క్ స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లు, కోర్టును తప్పుదోవ పట్టించేలా అక్రమ ఒప్పందాల ద్వారా స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా (HYDRAA), అడ్వకేట్ జనరల్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. ఈ భారీ స్కామ్‌కు తెరతీసిన ఎంపీ కేశినేని చిన్ని, ఆయన వెనుక ఉన్న సూత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు కాపీని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులకు కూడా ట్యాగ్ చేశారు.
MULTI-THOUSAND-CRORE GOVT LAND GRAB EXPOSED
I have petitioned CM @revanth_anumula to halt the illegal takeover of 112.72 Acres of public land in Shamshiguda,Pragathi Nagar,Hyderabad allotted for TGIIC IT Park.
Vijayawada MP Kesineni Sivanath (Chinni) & proxies (M/s Exella… pic.twitter.com/kPbMexMaOU— Kesineni Nani (@kesineni_nani) June 28, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
ఆగస్టు 19, 2026

Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్‌మేళా
ఆగస్టు 19, 2026

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
- ●Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్‌మేళా
- ●Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి
- ●Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం
- ●CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
- ●నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది

Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్‌మేళా

Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి

Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం



