Eatala Rajender | ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తున్న హైడ్రా: ఎంపీ ఈటల రాజేందర్
Eatala Rajender | హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల్ని కాపాడే పేరుతో హైడ్రా (HYDRAA) వేలాది మంది పేదల ఇండ్లను కూల్చివేస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. పేదల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Eatala Rajender | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల్ని కాపాడే పేరుతో హైడ్రా (HYDRAA) వేలాది మంది పేదల ఇండ్లను కూల్చివేస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. పేదల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని హస్మత్‌పేటలో హైడ్రా కూల్చివేసిన (HYDRAA Demolitions) ఇండ్లను ఎంపీ ఈటల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. `గతంలో ఏ పేదలకైతే భూములు అమ్మినరో.. ఆ జాగాలల్ల ఇల్లు కట్టుకొని ఉన్నారో.. కరెంట్ కనెక్షన్లు వచ్చినాయో.. చాలామంది జీఓ నంబర్ 58 కింద 59 కింద రెగ్యులైజ్ చేసుకున్నారో అలాంటి వాళ్ల జోలికి పోవద్దు. రాజకీయ పార్టీలు అనేక సార్లు చెప్పడమే కాకుండా కోర్టులు కూడా మొట్టెకాయలు వేశాయి.
హైడ్రా కమిషన్ నేరుగా మీరు ఎందుకు కూలుస్తున్నారు?. మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చిండు?. మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తది. కోర్టు బోన్‌లో నిలబెట్టాల్సి వస్తదని చెప్పి వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ రంగనాథ్ పెడిచెవిన పెట్టి పేదల ఇండ్లు కూల్చుతున్నారు. బాలానగర్ మండలం హస్మత్‌పేట (Hasmathpet) విలేజ్‌లో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంటకు (Archaeology Department) సంబంధించిన 28 ఎకరాల 28 గుంటలు భూమి గెజిట్ నోటిఫికేషన్ గెజెట్ ప్రకటించారు. కానీ నాడు రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దల అండతో బ్రోకర్లు రెచ్చిపోయి 60 గజాలు, 70 గజాలు, 80 గజాలు ప్లాటు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఆ దందా ఎదేచ్చగా కొనసాగింది.
అక్కడ 60 గజాల భూమి కొనుకుంటోళ్లు ఎమ్మెల్యే, ఆఫీసర్లు కాదు. బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో పని చేసే హమాలీలు, చిన్న చిన్న కూలీలు. మీరు కూల్చేసిన ఇల్లు బ్రోకర్ల చేతిలో ఉంటే.. భూ కబ్జాదారుల చేతిలో ఉంటే.. పెద్ద పెద్ద నాయకుల చేతిలో ఉంటే 100 శాతం గుంజుకోండి. కానీ ఇవాళ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొంతమంది నోటరీ చేసుకున్నారు. కొంతమంది స్టాంప్ పేపర్ల మీద సేల్ డీడ్ రాసుకున్నారు. అలాంటి పేదల జోలికి పోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.
మీరు ప్రభుత్వ స్థలాలు కాపాడండి. మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వ స్థలాల పేరు ఇవాళ అక్కడ హస్మత్‌పేటలో కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చి కరెంట్ కట్ చేసి, నీళ్లు బంద్ చేసి వాళ్ల ఉసురు పోసుకోవద్దు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎంపీగా గెలిచినప్పటి నుండి చూస్తున్న. ఒక్కనాడు కూడా ప్రశాంతమైన వాతావరణం లేదు.
రెవెన్యూ చట్టాలు పగడ్బందీగా అమలు చేసి ఉంటే ఇవాళ ఇంత దుఃఖం, ఇంత వేదన అక్కర ఉండేదా ?. నేను ఇక్కడ ఎంపీగా అస్మత్పేట్లో కూలగొట్టే ఇండ్లను ఆపాలని చెప్పి పోయే ప్రయత్నం చేస్తే ఇక్కడ రెండు పోలీస్ స్టేషన్ వాళ్ళు పదుల సంఖ్యలో వచ్చి నా గేట్ల దగ్గర పోలీస్ వెహికల్ పెట్టి నువ్వు పోవడానికి వీళ్ళే అని అడ్డుకున్నారు. ఇలా చేసినా ఆనాటి ప్రభుత్వం మట్టిలో ఎలా కలిసిపోయింది. ఇవ్వాల్టి ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తే మట్టి కలిసి పోద్ది అని హెచ్చరిస్తున్నాం.
ఆనాడు ధరణి పేరట ప్రభుత్వం 13 వ కాలం ఎత్తేసి.. ఇవాళ పేదల భూములు తనకు చెందకుండా ఎట్టైతే చేసిందో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా విలువైన భూమిని లాక్కుంటుంది. విలువైన భూములను ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా అయినవాళ్లకు కట్టబెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి ఉన్న నిరుపేదలు నిత్యం ఆందోళనతో భయంతో బతికే పరిస్థితి వచ్చింది. పేదవాళ్లకు అన్యాయం చేస్తే నీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుంది. సామాన్య ప్రజలతో గోక్కున్నోడు ఎవడు ముందట పడడు. ఇది అంతా కూడా సామాన్య ప్రజలు మీరు ఎక్కడ కూడా మీకు నిజంగా దమ్ము ఉంటే ఆనాడు ఏ కలెక్టర్ అయితే పర్మిషన్ ఇచ్చిండో ఆనాడు ఏ సబ్ రిజిస్టర్ అయితే రిజిస్ట్రేషన్ చేసిండో ఆనాడు ఏ ల్యాండ్ లాడ్ గ్రాబరో ల్యాండ్ బ్రోకరో లేకపోతే రియల్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అమ్మిరో వాళ్ళని పనిష్మెంట్ చేయండి తప్ప కొనుక్కొని ఉంటున్న వాళ్ళని మాత్రం పనిష్మెంట్ చేయొద్దు.
కొనుక్కున్న వారికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టం. రేపు తప్పకుండా కంప్లెయింట్ ఇప్పిస్తాం. ఎవరు ఏ బ్రోకర్ దగ్గర కొన్నాడు ఎంత డబ్బు వాళ్ళ చేతికి ముట్టింది తప్పకుండా రాసిస్తాం ఆ డబ్బులు మాకు వడ్డీతో సహా కట్టి ఇయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే తప్పకుండా మీరు కాన్సిక్వెన్సస్ ఫేస్ చేయాల్సి ఉంటది అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా` అని వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kesineni Nani | హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న విజయవాడ ఎంపీ.. సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు
జూన్ 28, 2026

HYDRAA | హైదరాబాద్‌లో మరో నాలుగు చెరువుల పునరుద్ధరిస్తున్న హైడ్రా..
జూన్ 26, 2026

HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Divija Prabhakar | హీరోయిన్గా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు - వారం గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్
- ●FSSAI | ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్ లాస్ట్
- ●KTR | బ్లూజె ఏరో స్టార్టప్ ఆవిష్కరణ ఎంతో గర్వకారణం
- ●Illegal Dumping | రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ వార్నింగ్
- ●Anant Ambani | టీటీడీకి భారీ విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ..
- ●Kesineni Nani | హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న విజయవాడ ఎంపీ.. సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు

Divija Prabhakar | హీరోయిన్గా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు - వారం గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్

FSSAI | ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్ లాస్ట్

KTR | బ్లూజె ఏరో స్టార్టప్ ఆవిష్కరణ ఎంతో గర్వకారణం

Illegal Dumping | రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ వార్నింగ్



