త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Austria Vs Algeria | ఆస్ట్రియాను గట్టెక్కించిన సాషా

Austria Vs Algeria | ప్రపంచకప్‌ గ్రూప్‌–జేలో ఆస్ట్రియా, అల్జీరియా మధ్య జరిగిన మ్యాచ్‌ టోర్నీలోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌ 3-3తో డ్రాగా ముగియడంతో ఇరు జట్లు రౌండ్‌ ఆఫ్‌ 32కు అర్హత సాధించగా.. చివరి క్షణంలో సమీకరణాలు మారడంతో ఇరాన్‌ ప్రపంచకప్‌ ఆశలు ఆవిరయ్యాయి.

P

Sports | Published On Jun 28, 2026, 11.53 am IST

Austria Vs Algeria | ఆస్ట్రియాను గట్టెక్కించిన సాషా
Advertisement
  • అల్జీరియాతో మ్యాచ్‌ డ్రా
  • 3-3 తేడాతో సమం
  • నాకౌట్‌లోకి రెండు జట్లు

Austria Vs Algeria | ప్రపంచకప్‌ గ్రూప్‌–జేలో ఆస్ట్రియా, అల్జీరియా మధ్య జరిగిన మ్యాచ్‌ టోర్నీలోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌ 3-3తో డ్రాగా ముగియడంతో ఇరు జట్లు రౌండ్‌ ఆఫ్‌ 32కు అర్హత సాధించగా.. చివరి క్షణంలో సమీకరణాలు మారడంతో ఇరాన్‌ ప్రపంచకప్‌ ఆశలు ఆవిరయ్యాయి. మ్యాచ్‌ చివరి క్షణాల వరకు స్కోరు 2-2తో సమంగా కొనసాగింది. అదనపు సమయంలో రియాద్‌ మహ్రెజ్‌ తన రెండో గోల్‌ నమోదు చేసి అల్జీరియాకు 3-2 ఆధిక్యం అందించాడు. ఆ గోల్‌తో ఆస్ట్రియా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమనిపించింది. అయితే మ్యాచ్‌ చివరి క్షణంలో సాషా కలాజ్‌డ్జిచ్‌ హెడ్డర్‌తో గోల్‌ చేసి ఆస్ట్రియాకు కీలక పాయింట్లు దక్కేలా చేశాడు. ఈ ఫలితంతో ఆస్ట్రియా గ్రూప్‌–జేలో అర్జెంటీనా తర్వాత రెండో స్థానంలో నిలిచి 1982 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌ నాకౌట్‌ దశకు చేరుకుంది. రౌండ్‌ ఆఫ్‌ 32లో యూరోపియన్‌ ఛాంపియన్‌ స్పెయిన్‌తో తలపడనుంది. అల్జీరియా గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచినా.. బెస్ట్‌ త్రీ ప్లేస్‌లో నిలిచి నాకౌట్‌కు దూసుకెళ్లింది. రౌండ్‌ 32లో స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.

ఇరాన్‌కు చేదు అనుభవం..

ఆస్ట్రియా, అల్జీరియా జట్లలో ఏదో ఒకటి గెలిస్తే బెస్ట్‌ త్రీ ప్లేస్‌లో ఇరాన్‌ నాకౌట్‌కు చేరే అవకాశాలు ఉండేది. అయితే, 96వ నిమిషంలో కలాజ్‌డ్జిచ్‌ గోల్‌ కారణంగా మొత్తం సమీకరణాలు మారిపోయాయి. ఈ ఒక్క గోల్‌తో ఇరాన్‌ అవకాశాలు చేజారాయి. దీంతో నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 1982 ప్రపంచకప్‌లో ఆస్ట్రియా, అప్పటి పశ్చిమ జర్మనీ మధ్య జరిగిన వివాదాస్పద మ్యాచ్‌ (డిస్‌గ్రేస్‌ ఆఫ్‌ గిజోన్‌)ను ఈ పోరు అభిమానులకు గుర్తు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు అనుకూలంగా ఆడి అల్జీరియాను టోర్నీ నుంచి బయటకు పంపాయని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సారి కూడా డ్రా ఇరు జట్లను నాకౌట్‌కు చేర్చే పరిస్థితి ఉండటంతో అలాంటి పరిస్థితి పునరావృతమవుతుందా అన్న చర్చ సాగింది. అయితే, ఇరు జట్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి అభిమానులకు ఆద్యంతం ఉత్కంఠకు గురి చేశాయి.

గోల్స్‌ వర్షం..

మ్యాచ్‌ ప్రారంభంలో మార్కో ఆర్నాటోవిచ్‌ గోల్‌తో ఆస్ట్రియా ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగం ముగిసేలోపు రఫీక్‌ బెల్ఘాలి గోల్‌ వేయడంతో సమీకరణాలు మారాయి. రెండో అర్ధభాగం ఆరంభంలో మార్సెల్‌ సాబిట్జర్‌ మరోసారి ఆస్ట్రియాకు ఆధిక్యం అందించగా.. కొద్ది సేపటికే హౌసెమ్‌ అవార్‌ ఇచ్చిన అద్భుత క్రాస్‌ను రియాద్‌ మహ్రెజ్‌ గోల్‌గా మలిచి మరోసారి స్కోర్‌ని సమం చేశాడు. మ్యాచ్‌ చివరి క్షణాల్లో అల్జీరియా ఆటపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అదనపు సమయంలో మహ్రెజ్‌ మరో గోల్‌తో విజయం ఖాయమైందనిపించినా.. చివరలో కలాజ్‌డ్జిచ్‌ హెడ్డర్‌తో గోల్‌ చేసి ఆస్ట్రియాను గట్టెక్కించాడు. ఒక్క గోల్‌తో ఇరు జట్ల నాకౌట్‌కు చేరగా.. నాకౌట్‌ వరల్డ్‌ కప్‌ ప్రయాణం ముగిసిపోయింది.

Advertisement
Advertisement