పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా
Colombia vs Portugal | ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ గ్రూప్–కే పోరులో కొలంబియా, పోర్చుగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0 తేడాతో డ్రాగా ముగిసింది. అయితే, ఈ ఫలితంతో కొలంబియా గ్రూప్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుని నాకౌట్ దశకు చేరుకోగా.. పోర్చుగల్ రెండో స్థానానికి పరిమితమైంది.
- ఒక్క గోల్ వేయలేకపోయిన ఇరుజట్లు
- గ్రూప్-కే స్థానంలో కొలంబియా
- రెండోస్థానానికే పరిమితమైన పోర్చుగల్
- ఆఫ్‌సైడ్‌తో గోల్ రద్దు
Colombia vs Portugal | ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ గ్రూప్–కే పోరులో కొలంబియా, పోర్చుగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0 తేడాతో డ్రాగా ముగిసింది. అయితే, ఈ ఫలితంతో కొలంబియా గ్రూప్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుని నాకౌట్ దశకు చేరుకోగా.. పోర్చుగల్ రెండో స్థానానికి పరిమితమైంది. మ్యాచ్ చివరి నిమిషాల్లో డేవిన్సన్ సాంచెజ్ సాధించిన గోల్‌ను స్వల్ప ఆఫ్‌సైడ్ కారణంగా వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) రద్దు చేయడంతో కొలంబియా చేజారింది. నాకౌట్ దశలో కొలంబియా ఘానాతో, పోర్చుగల్ క్రొయేషియాతో తలపడనుంది.
ప్రభావం చూపించలేకపోయినా రొనాల్డో..
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు మాజీ రియల్ మాడ్రిడ్ సహచరుడు జేమ్స్ రోడ్రిగెస్ తన అనుభవంతో కొలంబియాను ముందుండి నడిపించాడు. మ్యాచ్ ప్రారంభంలోనే కొలంబియాకు గోల్స్ చేసే అవకాశాలు లభించాయి. లూయిస్ డియాజ్ అందించిన అద్భుత పాస్‌ను జాన్ కొర్డోబా సద్వినియోగం చేసుకోలేక హెడ్డర్‌ను బార్‌పైకి పంపాడు. 17వ నిమిషంలో కూడా కొర్డోబా పవర్‌ఫుల్ షాట్‌తో గోల్‌కు చేరువైనా.. పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టా అద్భుతంగా అడ్డుకున్నాడు.
గోల్‌కీపర్ల ప్రతిభ
ప్రపంచకప్‌లో తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 11వ మ్యాచ్ ఆడిన జేమ్స్ రోడ్రిగెస్ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. అతను ఇచ్చిన చక్కటి పాస్‌తో జాన్ అరియాస్ గోల్‌కు ప్రయత్నించగా, రూబెన్ నెవెస్ గోల్‌లైన్‌పైనే క్లియర్ చేసి పోర్చుగల్‌ను ప్రమాదం నుంచి గట్టెక్కించాడు. రొనాల్డో తొలి అర్ధభాగంలో ఒక ఫ్రీకిక్‌తో గోల్‌కు ప్రయత్నించగా.. దాన్ని కొలంబియా గోల్‌కీపర్ కమిలో వర్గాస్ సులభంగా అడ్డుకున్నాడు. అనంతరం బ్రూనో ఫెర్నాండెస్ చేసిన ప్రయత్నాన్ని కూడా వర్గాస్ అద్భుతంగా నిలువరించాడు. రెండో అర్ధభాగంలోనూ ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. డియోగో డాలోట్ అందించిన క్రాస్‌ను జోవో ఫెలిక్స్ హెడ్డర్‌గా మలిచినా.. బంతి గురి తప్పింది. ప్రతిగా కొలంబియా వరుసగా రెండుసార్లు ఎటాక్ చేయగా.. జెఫర్సన్ లెర్మా, జాన్ అరియాస్ చేసిన ప్రయత్నాలను డియోగో కోస్టా అద్భుతంగా నిలువరించాడు. రొనాల్డోకు కూడా ఓ మంచి అవకాశం వచ్చినా.. షాట్ బయటకు వెళ్లిపోయింది. మ్యాచ్ చివరి క్షణాల్లో కొలంబియా ఒత్తిడి మరింత పెరిగింది. లూయిస్ సువారెజ్ చేసిన బైసికిల్ కిక్ స్వల్ప తేడాతో బార్‌పైగా వెళ్లింది.
వీఏఆర్ నిర్ణయంతో కొలంబియాకు నిరాశ
ఇక మ్యాచ్ ముగిసే వేళ డేవిన్సన్ సాంచెజ్ హెడ్డర్‌తో కొలంబియా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, వీఏఆర్ పరిశీలనలో బంతి స్వల్ప తేడాతో ఆఫ్‌సైడ్‌లో ఉన్నట్లు తేలడంతో గోల్‌ను రద్దు చేశారు. ఆ నిర్ణయంపై సాంచెజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గ్రూప్ అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరిన ఆనందంలో కొలంబియా అభిమానులు చివరికి సంతోషంగా మైదానాన్ని వీడారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Eatala Rajender | ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తున్న హైడ్రా: ఎంపీ ఈటల రాజేందర్
- ●Argentina vs Jordan | అర్జెంటినా హ్యాట్రిక్
- ●Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్
- ●Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో
- ●Croatia vs Ghana | నాకౌట్లోకి క్రొయేషియా
- ●Kaddu Ki Kheer | పెండ్లి వేడుకలో మిగిలిన పాయసం తిని.. 30 మందికి అస్వస్థత

Eatala Rajender | ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తున్న హైడ్రా: ఎంపీ ఈటల రాజేందర్

Argentina vs Jordan | అర్జెంటినా హ్యాట్రిక్

Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్

Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో




