Narayanapet | పని అమ్మాయితో బంగారం వ్యాపారి ‘లవ్ ఎఫైర్’.. ఇప్పుడామె 3 నెలల గర్భిణి
Narayanapet | ఓ బంగారం వ్యాపారి తన ఇంట్లో పని చేస్తున్న యువతి(20)ని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. అనేకసార్లు ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆ యువతి మూడు నెలల గర్భిణి.
Narayanapet | త్రినేత్ర.న్యూస్ : ఓ బంగారం వ్యాపారి తన ఇంట్లో పని చేస్తున్న యువతి(20)ని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. అనేకసార్లు ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆ యువతి మూడు నెలల గర్భిణి. ఇప్పుడు పెళ్లి చేసుకోనని ముఖం చాటేయడంతో.. ఈ వివాదం పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.
వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా పరిధిలోని కోస్గి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు సాయికృష్ణ స్థానికంగా గోల్డ్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరి నివాసంలో 20 ఏండ్ల వయసున్న ఓ యువతి పని మనిషిగా పని చేస్తోంది. అయితే ఆమెను సాయికృష్ణ ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరంగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం బాధిత యువతి మూడు నెలల గర్భిణి.
ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో సాయికృష్ణ కుటుంబ సభ్యులను నిలదీశారు. సెటిల్ చేసుకుందామని నచ్చజెప్పేందుకు వ్యాపారి యత్నించాడు. డబ్బులు ఆశజూపారు. కానీ యువతి అందుకు ఒప్పుకోలేదు. తనను కులం పేరుతో దూషించాడని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఒత్తిడి మేరకు ఆదివారం రాత్రి సాయికృష్ణపై అట్రాసిటీ కేసు నమోదైంది. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం నారాయణపేట జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్ట డీఎస్పీ లింగయ్య సోమవారం రాత్రి పేర్కొన్నారు. ఇరు కుటుంబాల వివరాలను సేకరించారు. ముఖ్యంగా సాయికృష్ణ ప్రవర్తనపై పోలీసులు ఆరా తీశారు.
సంబంధిత వార్తలు

Mahabubnagar | లక్ష రూపాయాలకు 15 రోజుల పసికందు విక్రయం..! కానీ కిడ్నాప్‌గా నాటకం..!!
జులై 18, 2026

Mahabubnagar Journalists Boycott | మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ పర్యటనలో హైడ్రామా.. అధికారుల తీరుపై జర్నలిస్టుల మూకుమ్మడి బహిష్కరణ
జులై 15, 2026

Amara Raja Giga Corridor | దివిటిపల్లి ప్లాంట్‌లో 400 మంది మహిళలే : గల్లా అరుణ కుమారి వల్లనే నేను గెలిచా
జులై 15, 2026
తాజావార్తలు
- ●Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?
- ●DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్
- ●Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?
- ●MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
- ●IPS Molest | నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?

DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్

Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?

MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి



