Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటేలా దుబాయ్‌లో బతుకమ్మ (Bathukamma) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని షబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించిన 16వ బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.
Bathukamma | త్రినేత్ర న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటేలా దుబాయ్‌లో బతుకమ్మ (Bathukamma) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని (Dubai) షబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించిన 16వ బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో 6 వేల మందికి పైగా తెలంగాణ ప్రవాసులు (Telangana NRIs) పాల్గొన్నారు. కార్యక్రమానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నగా, దుబాయ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, గణేష్ బిగాల, షకీల్ అమీర్, సురేందర్ జాజల, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, కోలాటాలు, నృత్యాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. `బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..` అంటూ మహిళలు ఆలపించిన పాటలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ప్రముఖ సినీ, జానపద గాయని మధుప్రియ తన ప్రత్యేక ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. మాట్ల తిరుపతి, డాక్టర్ కోకిల నాగరాజు, అంజలి పులింతి తదితరుల ఆటపాటలు వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకువచ్చాయి, చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు విశేషంగా ఆకట్టుకోగా, కేసీఆర్ పాటలకి BRS నాయకులు తమ ఆటపాటలతో ఉర్రూత ఊగించారు. పలువురు మహిళలు కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో కూడిన బతుకమ్మ తయారు చేసి తీసుకురావడం విశేషం.
2011 నుంచి నిరంతరంగా..
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్, అధ్యక్షుడు చీటీ జగదీశ్ రావు మాట్లాడుతూ.. `2011 నుంచి యూఏఈ గడ్డపై బతుకమ్మ వేడుకలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. కొద్దిమందితో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు వేలాది మంది తెలంగాణ ప్రవాసులు పాల్గొనే భారీ సాంస్కృతిక వేడుకగా ఎదిగింది. యూఏఈ లో నివసిస్తున్న తెలంగాణ ప్రజల ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు, ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలంగాణ వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు ఆపదలో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలకు అండగా నిలవడం ప్రధాన లక్ష్యం` అని చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన స్పాన్సర్లు, కళాకారులు, మహిళా విభాగం, కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు, తెలంగాణ కుటుంబాలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

అరుదైన కళాఖండం
తెలంగాణ చేనేత కళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే ప్రత్యేక కళాఖండం ఈ వేడుకల్లో మరో విశేషంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వెండి పట్టు దారాలతో ముగ్గురు పాలకుల ముఖచిత్రాలను చేనేత వస్త్రంపై అద్భుతంగా రూపొందించారు.
సుమారు రెండు మీటర్ల పొడవున్న ఈ కళాఖండం తయారీలో 26 గ్రాముల వెండిని వినియోగించారు. ఈ ప్రత్యేక డిజైన్ రూపకల్పనకు సుమారు 15 రోజులు పట్టగా, మగ్గంపై నేయడానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టిందని కళాకారుడు తెలిపారు. దుబాయ్ పాలకునికి అందించేందుకు రూపొందించిన ఈ కళాఖండం సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ కళాఖండాన్ని ETCA ప్రతినిధులు దుబాయ్ కన్సుల్ జనరల్ విష్ణు వర్ధన్ రెడ్డి ద్వారా దుబాయ్ పాలక కుటుంబానికి అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో ETCA కార్యవర్గ సభ్యులు పీచర కిరణ్ కుమార్, చీటీ జగదీశ్ రావు, రాణి కోట్ల, అలిగేటి శ్రీనివాస్, గుండవేని శేఖర్, తిరుమల రావు బీరెల్లి, రాధారపు సత్యం, మామిడి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సాయి చందర్, సురేష్ రెడ్డి, రఘు అలిగేటి, వినోద్ ఆచార్యులు, ఎస్.పీ. కస్తూరి, సంతోష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సారిక, మమత, సరోజ, రణీశ, మౌనిక, రాజేష్, కార్తీక్ రెడ్డి, రమణ, మధు కుమార్, రణధీర్, రవి చంద్ర కొక్కొండ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | రైతన్నలూ! మా మాట వినండి.. యాసంగి పంట వద్దు
అక్టోబర్ 11, 2026

Komatireddy Rajagopal Reddy | ఏదుల నుంచి మునుగోడుకు నీళ్లు తరలించాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు
అక్టోబర్ 11, 2026

Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత.. పెట్టుబడి పెట్టాలా, వేచి చూడాలా..?
- ●Nagarjuna Sagar | తాగునీటి అవసరాలకు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
- ●Stock Markets | చమురు ధరల తగ్గుదల ఎఫెక్ట్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●RTC Metro Common Pass | ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై పునఃపరిశీలన.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Software Engineer | హీలియం గ్యాస్ పీల్చుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
- ●Bhagat Singh | పంజాబ్ ఓటరు జాబితాలో స్వాతంత్య్ర సమరయోధుడి ఫొటో..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత.. పెట్టుబడి పెట్టాలా, వేచి చూడాలా..?

Nagarjuna Sagar | తాగునీటి అవసరాలకు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

Stock Markets | చమురు ధరల తగ్గుదల ఎఫెక్ట్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

RTC Metro Common Pass | ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై పునఃపరిశీలన.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్



