త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anganwadi Teachers | 15,982 అంగ‌న్‌వాడీ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ.. ఇంట‌ర్మీడియ‌ట్ త‌ప్ప‌నిస‌రి..!

Anganwadi Teachers | రాష్ట్రంలోని నిరుద్యోగ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 అంగ‌న్‌వాడీ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌క్రియ ప్రారంభించింది.

S

Telangana | Published On Jun 23, 2026, 6.39 am IST

Anganwadi Teachers | 15,982 అంగ‌న్‌వాడీ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ.. ఇంట‌ర్మీడియ‌ట్ త‌ప్ప‌నిస‌రి..!
Advertisement

Anganwadi Teachers | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని నిరుద్యోగ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 అంగ‌న్‌వాడీ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌క్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌తో పాటు స‌హాయ‌కుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అయితే అంగ‌న్‌వాడీ టీచ‌ర్, స‌హాయ‌కుల పోస్టుల భ‌ర్తీకి ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఈసారి త‌ప్పనిస‌రి చేసింది. దీంతో పాటు ఈసారి ఇంట‌ర్వ్యూ విధానాన్ని కూడా అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది.

ఈ మేర‌కు తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నం.4, మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నం.6 జారీ చేసింది. ఆ ప్రకారం.. మల్టీజోన్‌-1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్‌-2 పరిధిలో 15,197 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1247 టీచర్లు, 5145 సహాయకులు కలిపి 6,392 ఖాళీలు ఉన్నాయి.

ఈ క్ర‌మంలో ఆయా జిల్లాల్లోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమశాఖ..భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్‌ పోస్టులు, మహబూబ్‌నగర్‌లోని 4 ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీకానున్నాయి.

 

Advertisement
Advertisement