Congress vs BJP | చలో అంకాపూర్.. ఆర్మూర్‌లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ.. అమల్లోకి 144 సెక్షన్
Congress vs BJP | అధికార కాంగ్రెస్, బీజేపీల (Congress vs BJP) పోటాపోటీ కార్యక్రమాలతో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో (Armoor) ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఇరు పార్టీలో చలో అంకాపూర్ (Chalo Ankapur) కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.
Congress vs BJP | త్రినేత్ర.న్యూస్: అధికార కాంగ్రెస్, బీజేపీల (Congress vs BJP) పోటాపోటీ కార్యక్రమాలతో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో (Armoor) ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఇరు పార్టీలో చలో అంకాపూర్ (Chalo Ankapur) కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (బీజేపీ) ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునవ్వగా, వారిని అడ్డుకునేందుకు అంకాపూర్ తరలిరావాలంటూ తమ కార్యకర్తలకు బీజేపీ ఆదేశాలు జారీచేసింది. పోటాపోటీ కార్యక్రమాలతో ఆర్మూర్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ధర్నాలు, ర్యాలీలు, బంద్ పిలుపులను నిషేధించడంతోపాటు 144 సెక్షన్ (144 section) అమలు చేస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
మరోవైపు ఇరు పార్టీల ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశారు. నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మూర్, అంకాపూర్‌లో (Ankapur) భారీగా బలగాలను మోహరించారు. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) ఇంటి ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
అసలు కారణం ఇదీ..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూపాయకే వైద్యం అందించాలని, ప్రతి గ్రామానికి సొంతంగా పది ఒండ్లి కట్టించాలని స్థానిక ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ (Congress) డిమాండ్ చేస్తున్నది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడి పేరుతో చలో అంకాపూర్‌కు పిలుపునిచ్చింది. దీంతో తాను యుద్ధానికి సిద్ధమంటూ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు తరలిరావాలంటూ బీజేపీ (BJP) కూడా చలో అంకాపూర్‌కు పిలుపునిచ్చింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు






