TGREDCO DGM | అవినీతి `ముత్యం`.. టీజీ రెడ్కో డీజీఎంకు 14 రోజుల రిమాండ్.. ఆస్తుల విలువ ఎంతంటే?
TGREDCO DGM | తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TG Redco) డీజీఎం ముత్యం వెంకటరమణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది.
TGREDCO DGM | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TG Redco) డీజీఎం ముత్యం వెంకటరమణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను (TGREDCO DGM) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం ఏసీబీ కోర్టులో (ACB Court) హాజరుపరిచారు. ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, వెంకటరమణ నివాసాలతోపాటు ఖైరతాబాద్‌లోని రెడ్కో ఆఫీసు, హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 9 చోట్ల జరిగిన సోదాల్లో అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించారు.
ముత్యం వెంకటరమణ (Mutyam Venkata Ramana) 2019లో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ కేసు కోర్టులో విచారణలో ఉండగానే అక్రమంగా ఆస్తులు సంపాదించిన వ్యవహారంలో మరోసారి అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. దీంతో గతంలో దొరికిన మొత్తంతో కలిపి ఏకంగా రూ.28.14 కోట్లకుపైగా ఆస్తులతో పట్టుబడ్డారు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భార్య పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం..
ప్రభుత్వ అధికారిగా కొనసాగుతూనే భార్య పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estate Business) నిర్వహిస్తున్నారు. ముత్యం బిల్డర్స్, డెవలపర్స్, ముత్యం ఏఎన్‌ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, ముత్యం కన్‌స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ పేరుతో సంస్థలున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో జరిగిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు కూకట్‌పల్లిలో 10 అపార్ట్‌మెంట్లను ఈ కంపెనీలు నిర్మించినట్లు తేలింది.
భారీగా ఆస్తులు..
వెంకటరమణ, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో భారీగా స్థిరచ, చరాస్తులను అధికారులు గుర్తించారు. మాదాపూర్ గుట్టల బేగంపేటలో రూ.2.9 కోట్ల విలువైన ఐదంతస్తుల భవనం, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిల్లో రూ.1.23 కోట్ల విలువైన నాలుగు ఫ్లాట్లు, మూసాపేట ఆంజనేయనగర్‌లో రూ.20 కోట్ల విలువైన ఫ్లాట్లు, కూకట్‌పల్లి ఆంజనేయనగర్‌లో 160 చదరపు గజాల్లో రూ.1.82 కోట్ల విలువైన మూడంతస్తుల భవనం, బ్యాంకు లాకర్లో రూ.40 లక్షల విలువైన 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు బ్యాంకు ఖాతాల్లో రూ.52.02 లక్షలు, రూ.30 లక్షల విలువైన గృహ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఖరీదైన గడియారాలు, రూ.45 లక్షల విలువైన కియా, మహేంద్ర, బాలెనో కార్లు, రూ.2.5 లక్షల విలువైన 19 విదేశీ మద్యం సీసాలు అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు






