త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ స‌చివాల‌యం ఉద్యోగులు

ACB Raids | స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లోని టెంపుల్ వ‌ద్ద సెక్ష‌న్ ఆఫీస‌ర్ వినోద్ లంచం తీసుకుంటుండ‌గా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

S

Telangana | Published On Sep 10, 2026, 3.56 pm IST

ACB Raids | ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ స‌చివాల‌యం ఉద్యోగులు
Advertisement

ACB Raids | త్రినేత్ర‌.న్యూస్ : స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లోని టెంపుల్ వ‌ద్ద సెక్ష‌న్ ఆఫీస‌ర్ వినోద్ లంచం తీసుకుంటుండ‌గా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. వినోద్‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాఘ‌వేంద్ర‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

సీఎం రిలీఫ్ పండ్ చెక్కు విష‌యంలో రూ. 2 ల‌క్ష‌ల‌కు గానూ రూ. ల‌క్ష ఇవ్వాల‌ని బాధిత వ్య‌క్తిని వినోద్ డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్ర‌తో క‌లిసి వినోద్ రూ. ల‌క్ష తీసుకుంటుండ‌గా.. అక్క‌డే మాటు వేసిన ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. అనంత‌రం వారిద్ద‌రిని నాంప‌ల్లిలోని ఏసీబీ కార్యాల‌యానికి త‌ర‌లించి విచారించారు.

Advertisement
Advertisement