KCR Birthday | కేసీఆర్ పుట్టినరోజు.. సుందర్ బన్ అడవుల్లో 20 వేల మొక్కలకు ప్రాణం
KCR Birthday | కేసీఆర్ (KCR)... కేవలం తెలంగాణ సాధించిన ఉద్యమకారుడిగానో ... తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగానో మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోయే వ్యక్తిత్వం కాదు.
KCR Birthday | కేసీఆర్ (KCR)... కేవలం తెలంగాణ సాధించిన ఉద్యమకారుడిగానో ... తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగానో మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోయే వ్యక్తిత్వం కాదు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ జాతీయ స్థాయిలో సమున్నతంగా నిలిపిన అభినవ శిల్పి. పారిశ్రామికంగా... సామాజికంగా రాష్ట్రాన్ని ముందుకు నడపడమే కాకుండా పర్యావరణపరంగా తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని భావించి అధికారంలో ఉన్నపుడు అవిశ్రాంతంగా శ్రమించిన హరిత కార్మికుడు. రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటించి హరిత తెలంగాణ అనే ట్యాగ్ లైన్ సాధించిన ప్రకృతి ఆరాధకుడు అయన. పంచాయతీల్లో సైతం పార్కులు నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో మొక్కల సంఖ్యను అమాంతం పెంచి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉందీ అంటే అదిగో ఆ పచ్చని మొక్కలు.. చెట్ల మాటున చల్లగా వర్ధిల్లుతోంది అని యావత్ దేశం చెప్పుకునేలా చేశారు.
ఇక ఇదే క్రమంలో ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మ దినం (KCR Birthday) సందర్భంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి అందరిలోనూ పర్యావరణంపై మక్కువ కలిగేలా చేస్తున్నారు. ఈసారి గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల పరీవాహకంలో ఉన్న సుందర్ బన్ డెల్టా ప్రాంతంలో (Sundarbans forest) కేసీఆర్ జన్మ దినం సందర్భంగా పదివేల మ్యాన్గ్రోవ్ మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) నాయకత్వంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం.
కేసీఆర్ పాలనలో పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ ప్రధాన విధుల్లో ఒకటిగా మారింది. రాష్ట్రంలో కోట్లాది కొత్తమొక్కలు మొలకెత్తి అవిప్పుడు చెట్లు.. వృక్షాలుగా మారాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేవలం విధానాలనే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి తత్వాన్నే రూపకల్పన చేసే బాధ్యతను వహించారు. ఆయన నాయకత్వంలో హరిత హారం దీర్ఘకాలిక పర్యావరణ సవరణగా రూపుదిద్దుకుంది. కొత్త రాష్ట్ర పునాదులు పర్యావరణపరంగా సురక్షితంగా ఉండాలన్న స్పష్టమైన సంకల్పంతో అడవుల విస్తీర్ణం పెంచడం, భూగర్భజలాలను పునరుద్ధరించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, వాతావరణ సహనశక్తిని తెలంగాణ అభివృద్ధి పథంలో భాగం చేయడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగారు.
తెలంగాణ నుంచి దేశమంతటికి పాకిన హరిత ఉద్యమం
హరిత హారం గొప్పతనం తెలంగాణలో వచ్చిన ఫలితాలతోనే కాదు, రాష్ట్ర సరిహద్దులను దాటి ప్రేరణనివ్వడంలో ఉంది. సంతోష్ కుమార్ ఆలోచనల్లోంచి జన్మించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఉద్యమం. దేశంలోనే ఈ అంశంలో గొప్ప ముందడుగు వేసింది. 2018లో మొదలైన ఈ పర్యావరణ ఉద్యమం కోట్లాది విత్తనాలను అడవుల్లో నాటింది. యువత, విద్యార్థులతో మమేకమై కోట్ల మొక్కలకు ప్రాణం పోసింది. ఈ ఉద్యమంలో యువత, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్లు, పౌర సమాజాన్ని సైతం భాగస్వాములను చేసి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 195 మిలియన్ మొక్కలు నాటడంతోపాటూ 20,000కు పైగా జలవనరులకు పునరుజ్జీవం కలిగించడం గొప్ప మేలిమలుపు అయింది.
ఇక ఇప్పుడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా గంగా–బ్రహ్మపుత్ర–మేఘ్నా డెల్టాలో సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుందర్బన్ అడవుల్లో పదివేల మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ మడ అడవులు తీరానికి గొప్ప రక్షణ కలిగిస్తూ గ్రీన్ ఆర్మ్ పాత్రను పోషిస్తున్నాయి. తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడడం.. అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో ఈ మడ అడవుల పాత్ర ఎనలేనిది.
కానీ వరుస తుపానును, నేలలోకి ఉప్పునీరు ఇంకిపోయి నెల స్వభావాన్ని ప్రభావితం చేయడం.. అస్థిరమైన వర్షపాతం, ఐలా, అంఫాన్, యాస్, సిత్రాంగ్ వంటి తుఫాన్లు ఈ ప్రాంతాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. దీంతో మడ అడవుల మనుగడకు విఘాతం కలుగుతోంది. దీంతో ఈ అడవులకు మరింత శక్తిని కూడగట్టే ప్రక్రియకు కేసీఆర్ జన్మదినం ఒక ప్రత్యేక వేదికగా మారుతోంది.
తెలంగాణ వ్యవస్థాపకుడికి హరిత నివాళి
ఫిబ్రవరి 17న, కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా, సుందర్‌బన్ మడ అడవుల్లో 20,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికుల సహకారంతో ఈ మొక్కలను సుందర్బన్ అడవుల్లో నాటి పర్యావరణాన్ని కాపాడే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్న నినాదాన్ని యువత దేశవ్యాప్తం చేస్తున్నారు. ఈ అడవులు తీరాన్ని కాపాడే విషయంలో ఎంత కీలకపాత్ర పోషిస్తున్నాయన్నది మనతోబాటు ముందుతరాలకు సైతం చేరవేయడం ఈ ఉద్యమ ఉద్దేశ్యం. పర్యావరణ ప్రేమికులందరినీ ఒక చోట చేర్చి ఈ ప్రక్రియను ఘనంగా చేపట్టి కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయడం మా లక్ష్యమని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.
https://x.com/SantoshKumarBRS/status/2023614421193699543
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



