Nani Paradise | నాని ప్యారడైజ్ రిలీజ్ పోస్ట్‌పోన్ కానున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని మార్చి 26న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. మార్చిలో ప్యారడైజ్‌తో పాటు రామ్‌చరణ్ పెద్ది, యశ్ టాక్సిక్, రణవీర్‌సింగ్ ధురంధర్ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పెద్ది, ప్యారడైజ్ రిలీజ్‌కు ఒకే రోజు గ్యాప్ ఉండటం ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియన్ సినిమాల మధ్య పోటీ కారణంగా ప్యారడైజ్ మూవీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ పోస్టర్... తాజాగా ఈ పోస్ట్‌పోన్‌పై ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు నాని. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 2026లో జడల్ జమానాను చూడబోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్యారడైజ్ నుంచి రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్‌లో రిలీజ్ డేట్ కనిపించింది. కానీ న్యూ ఇయర్ పోస్టర్‌లో మాత్రం రిలీజ్ డేట్ లేకపోవడం ఆసక్తికరంగా మారింది. 2026లో సినిమా విడుదల కాబోతున్నట్లు మాత్రమే పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా పోస్ట్‌పోన్ కావడం పక్కా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు విలన్... న్యూ ఇయర్ పోస్టర్‌లో రా అండ్ రస్టిక్‌గా నాని కనిపిస్తున్నారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నారు. శికాంజ మాలిక్ అనే క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో నానికి జోడీగా కయదు లోహర్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ప్యారడైజ్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఎస్ఎల్‌వీ సినిమాపై పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్యారడైజ్ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజీత్‌తో ఓ సినిమా చేయబోతున్నారు నాని. ఈ స్టైలిష్ యాక్షన్ కామెడీ మూవీకి గన్స్ అండ్ రోజెస్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.