Jio IPO | జియో ఐపీఓకు గ్రీన్ సిగ్నల్.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు.. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు దిశగా..
Jio IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Jio IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)కి ఆమోదం లభించిందని, సెబీతోపాటు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు కూడా ఫైలింగ్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక్కో షేరుకు రూ.10 ముఖ విలువతో గరిష్టంగా 27 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ రూపంలో ఐపీఓను తీసుకురానున్నారు. అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత ఈ ఐపీఓ మార్కెట్లోకి రానుంది.
వారసులను ప్రకటించిన ముకేష్ అంబానీ..
ఈ సందర్భంగా ముకేష్ అంబానీ మాట్లాడుతూ జియో ఐపీఓ రిలయన్స్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన విలువ సృష్టి ఘట్టాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత వాటాదారులకు గణనీయమైన విలువను అందించడమే కాకుండా, కొత్త పెట్టుబడిదారులకు కూడా ఆకర్షణీయమైన అవకాశంగా మారుతుందని చెప్పారు. రిలయన్స్‌కు తన వాటాదారులతో ఉన్న అనుబంధం గర్వం, నమ్మకం, గౌరవం, ఉమ్మడి వృద్ధి పునాదులపై నిర్మితమైనదని ఆయన పేర్కొన్నారు. జియో భవిష్యత్ అభివృద్ధికి తదుపరి తరం నాయకత్వం సిద్ధమైందని చెబుతూ ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ, అనంత్ అంబానీ జియో ఐపీఓ ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారని ముకేష్ అంబానీ తెలిపారు. భవిష్యత్ విలువ సృష్టి అవకాశాలను వీరే ముందుకు నడిపిస్తారని చెప్పారు.
Shri Mukesh Ambani at #RILAGM announces the Jio Platforms’ board approval of DRHP and its filing with SEBI today.#Jio #RILAGM2026 pic.twitter.com/x39Yx4JsJg
— Reliance Jio (@reliancejio) June 19, 2026
అతి పెద్ద ఐపీవో దిశగా..
పదేళ్ల క్రితం భారత్‌లో డిజిటల్ అసమానతలను తొలగించాలనే లక్ష్యంతో జియో ప్రారంభమైందని ముకేష్ అంబానీ గుర్తుచేశారు. అప్పట్లో ఖరీదైన వాయిస్ సేవలు, అధిక ధరల డేటా, తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్న పరిస్థితులను జియో పూర్తిగా మార్చేసిందన్నారు. ఉచిత వాయిస్ సేవలు, సరసమైన ధరల్లో హైస్పీడ్ డేటా అందించి కోట్లాది భారతీయుల డిజిటల్ జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు. కాగా మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం జియో ఐపీఓ భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశముందని భావిస్తున్నారు. దీని విలువ సుమారు 4 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 52.4 కోట్లకు పైగా చందాదారులతో జియో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతోంది. జియో 5జీ సేవలకు 26.8 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా 1.3 కోట్ల గృహాలకు కనెక్టివిటీని అందిస్తోంది. దీంతో జియో లిస్టింగ్‌పై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారీగా ఆసక్తి నెలకొంది.
సంబంధిత వార్తలు

Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..
అక్టోబర్ 2, 2026

Jio Platforms IPO | జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
ఆగస్టు 29, 2026

Reliance Industries | అంబానీ కీలక అడుగు.. రోల్స్ రాయిస్‌తో కలిసి ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ..
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●Asian Games | 44 ఏళ్ల నిరీక్షణకు తెర..! ఆసియా కప్ వుమెన్స్ హాకీలో భారత్‌కు స్వర్ణం
- ●BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్
- ●Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..
- ●Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
- ●Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే

Asian Games | 44 ఏళ్ల నిరీక్షణకు తెర..! ఆసియా కప్ వుమెన్స్ హాకీలో భారత్‌కు స్వర్ణం

BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్

Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..



