త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | సాయంత్రం 6.30 త‌ర్వాత హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..!

Heavy Rains | మంగ‌ళ‌వారం మాదిరిగానే ఇవాళ కూడా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షం ముంచెత్తే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. సాయంత్రం 6.30 త‌ర్వాత హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

S

Hyderabad | Published On Jun 10, 2026, 5.58 pm IST

Heavy Rains | సాయంత్రం 6.30 త‌ర్వాత హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..!
Advertisement

Heavy Rains | త్రినేత్ర‌.న్యూస్ : మంగ‌ళ‌వారం మాదిరిగానే ఇవాళ కూడా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షం ముంచెత్తే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. సాయంత్రం 6.30 త‌ర్వాత హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ప‌శ్చిమ హైద‌రాబాద్‌పై తీవ్ర ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంది. బ‌ల‌మైన గాలుల‌తో పాటు ఉరుములు, మెరుపులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌న్నారు.

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని చేవెళ్ల‌, మొయినాబాద్, శంక‌ర్ ప‌ల్లి, మోకిల, చిల్కూరు, కొల్లూరుతో పాటు సంగారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రాబోయే 2 గంట‌ల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట‌కు రావాల‌ని చెప్పారు.

Advertisement
Advertisement