Hyderabad | చెరువులో పడ్డ ‘ఇయర్‌బర్డ్స్’.. నీటి మునిగిన ఇద్దరు స్నేహితులు
Hyderabad | చెరువులో పడ్డ ఇయర్ బర్డ్స్‌ను వెలికితీసేందుకు నీటిలోకి దిగిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు మరో యువకుడు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : చెరువులో పడ్డ ఇయర్ బర్డ్స్‌ను వెలికితీసేందుకు నీటిలోకి దిగిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు మరో యువకుడు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగర శివారులోని తిమ్మాయిపల్లి పెద్ద చెరువు వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బొల్లారం ఆదర్శనగర్‌కు చెందిన కెవిన్ ఆంటోని(19) ఇంటర్ పూర్తి చేశాడు. ఇక డిగ్రీలో చేరేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఆంటోనికి తల్లిదండ్రులు కొత్తగా బైక్ కొనిచ్చారు. వరుసకు సోదరుడైన వాలెంటైన్ టోనీ(18)ని కొత్త బైక్‌పై ఎక్కించుకుని తిమ్మాయిపల్లి సమీపంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. వీరితో పాటు స్నేహితుడు అమెస్ జోసఫ్ కూడా వెళ్లాడు.
అయితే ఇదే చెరువు వద్ద మూడు రోజుల క్రితం ఫొటోషూట్ చేస్తుండగా ఈ ముగ్గురిలో ఒకరి ఇయర్ బర్డ్స్ నీటిలో పడిపోయాయి. ఇక రూ. 1500 విలువ చేసే ఇయర్ బర్డ్స్‌ను వెలికితీసేందుకు యత్నించారు. ఈత రాకున్నప్పటికీ.. ముగ్గురు చెరువులో దిగారు. మొదట వాలెంటైన్ టోనీ నీటిలోకి దిగాడు. అతని వెనుకాలే ఆంటోని వెళ్లాడు. ఇద్దరు నీట మునిగిపోతుండగా.. జోసఫ్ గమనించి కాపాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న కీసర సీఐ ఆంజనేయులు సిబ్బందితో చెరువు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కెవిన్ ఆంటోనీ మృతదేహం వెలికి తీశారు. గల్లంతైన వాలెంటైన్ టోనీ కోసం డీఆర్‌ఎఫ్ బృందం గాలించి వెలికితీసింది.
తాజావార్తలు
- ●DGP CV Anand | పోలీస్ నియామకాల్లో పారదర్శకతే ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ●Heritage at Every Step 2.0 | మన చరిత్రను బతికిద్దాం: హెరిటేజ్ ఎగ్జిబిషన్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపు
- ●CM Revanth Reddy | అందెశ్రీ నాకు ఆత్మబంధువు..
- ●CM Revanth Reddy | నువ్వెంత.. నీ జాతి ఎంత..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
- ●Shiv Sena UBT Merger | ఉద్ధవ్ ఠాక్రేకు స్పీకర్ బిగ్ షాక్: ఏక్నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీలు.. టీఎంసీలోనూ చీలిక!
- ●CM Revanth Reddy | గజ్వేల్‌లోనే నిన్ను సమాధి చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి

DGP CV Anand | పోలీస్ నియామకాల్లో పారదర్శకతే ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Heritage at Every Step 2.0 | మన చరిత్రను బతికిద్దాం: హెరిటేజ్ ఎగ్జిబిషన్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపు

CM Revanth Reddy | అందెశ్రీ నాకు ఆత్మబంధువు..

CM Revanth Reddy | నువ్వెంత.. నీ జాతి ఎంత..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్





