Ritika Nayak | షూటింగ్ మొదలుకాకముందే నితిన్ సినిమా నుంచి హీరోయిన్ ఔట్ – తప్పుకుందా? తప్పించారా?
నితిన్ హీరోగా సోము - నర్రి అనే కొత్త దర్శకులతో ఓ రొమాంటిక్ యాక్షన్ మూవీ ఇటీవలే మొదలైంది. షూటింగ్ మొదలుకాకముందే ఈ సినిమా నుంచి హీరోయిన్ రితికా నాయక్ తప్పుకుందట. ఆమె స్థానంలో నితిన్‌కు జోడీగా కనిపించబోతున్న కొత్త హీరోయిన్ ఎవరంటే?
Entertainment | Published On Jun 19, 2026, 5.25 pm IST
Ritika Nayak | నితిన్ హిట్టు అందుకొని చాలా కాలమే అయ్యింది. భీష్మ తర్వాత నితిన్ హీరోగా నటించిన తొమ్మిది సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఫ్లాపుల్లో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టాడు. హీరోగా కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఇటీవలే ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సోము - నర్రి డైరెక్టర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.మిరాయ్ ఫేమ్ రితికా నాయక్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. మే నెలలో ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో నితిన్‌తో పాటుగా రితికా నాయక్ కూడా పాల్గొన్నది. షూటింగ్ మొదలుకావడమే తరువాయి అనుకుంటున్న టైమ్‌లో మేకర్స్‌కు పెద్ద షాక్ తగిలిందట.
రెమ్యూనరేషన్ కారణమా?
సెట్స్‌లో అడుగుపెట్టకముందే నితిన్ కొత్త మూవీ నుంచి రితికా నాయక్ తప్పుకుందట. రెమ్యూనరేషన్ ఇష్యూస్‌తోనే ఆమె ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు వార్తలొస్తున్నాయి. అంగీకరించిన దానికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ రితికా నాయక్‌ను పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
బేబీ ఫేమ్...
రితికా నాయక్ స్థానంలో బేబీ ఫేమ్ వైష్ణవిచైతన్యను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సితార బ్యానర్‌లోనే ఎపిక్ మూవీ చేస్తోంది వైష్ణవి చైతన్య. రొమాంటిక్ మూవీలో వైష్ణవి బోల్డ్ రోల్‌లో కనిపించబోతుంది. వైష్ణవి నటనకు ఇంప్రెస్ అయిన ప్రొడ్యూసర్లు నితిన్ మూవీలోనూ ఈ అచ్చ తెలుగు బ్యూటీకి అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హీరోయిన్ ఛేంజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి మొదలుకానుందని అంటున్నారు. కాగా కొత్త దర్శకులతో పాటు వీఐ ఆనంద్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా చేస్తోన్నాడు నితిన్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..
జూన్ 19, 2026

Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది – కిస్సిక్ సింగర్ వాయిస్‌తో…
జూన్ 19, 2026

Folk Dancer | హీరోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ – సుకుమార్ సినిమాలో ఛాన్స్
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Sreeleela | సాయిపల్లవి, శ్రీలీల తమిళ మూవీ టైటిల్ ఇదే - అల్లు అర్జున్ పుష్ప తో లింక్?
- ●Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా 'పోచంపల్లి సిల్క్ స్టోల్'.. అందజేసిన ప్రధాని మోదీ
- ●Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..
- ●Save The Tigers 3 Review | సేవ్ ది టైగర్స్ సీజన్ 3 రివ్యూ - జియో హాట్‌స్టార్‌లో రిలీజైన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●Gandhi Sarovar | గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే
- ●Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు

Sreeleela | సాయిపల్లవి, శ్రీలీల తమిళ మూవీ టైటిల్ ఇదే - అల్లు అర్జున్ పుష్ప తో లింక్?

Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా 'పోచంపల్లి సిల్క్ స్టోల్'.. అందజేసిన ప్రధాని మోదీ

Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..

Save The Tigers 3 Review | సేవ్ ది టైగర్స్ సీజన్ 3 రివ్యూ - జియో హాట్‌స్టార్‌లో రిలీజైన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?



