TG Weather | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు, వడగాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..
TG Weather | రాగల నాలుగురోజుల పాటు తెలంగాణలో వడగాలులు వీచడంతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాబోయే రెండురోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని స్పష్టం చేసింది.
TG Weather | రాగల నాలుగురోజుల పాటు తెలంగాణలో వడగాలులు వీచడంతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాబోయే రెండురోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని స్పష్టం చేసింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వివరించింది. సోమవారం నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని పేర్కింది. అలాగే, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు పడే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు.. వన్‌వే ట్రయల్ రన్
జూన్ 19, 2026

Yuvraj Singh | ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుస్తాడా..? సపోర్టింగ్ స్టాఫ్‌లోకి యువరాజ్‌సింగ్..!
జూన్ 19, 2026

Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు.. వన్‌వే ట్రయల్ రన్
- ●Yuvraj Singh | ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుస్తాడా..? సపోర్టింగ్ స్టాఫ్‌లోకి యువరాజ్‌సింగ్..!
- ●Sreeleela | సాయిపల్లవి, శ్రీలీల తమిళ మూవీ టైటిల్ ఇదే - అల్లు అర్జున్ పుష్ప తో లింక్?
- ●Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా 'పోచంపల్లి సిల్క్ స్టోల్'.. అందజేసిన ప్రధాని మోదీ
- ●Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..
- ●Save The Tigers 3 Review | సేవ్ ది టైగర్స్ సీజన్ 3 రివ్యూ - జియో హాట్‌స్టార్‌లో రిలీజైన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Traffic Restrictions | కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు.. వన్‌వే ట్రయల్ రన్

Yuvraj Singh | ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుస్తాడా..? సపోర్టింగ్ స్టాఫ్‌లోకి యువరాజ్‌సింగ్..!

Sreeleela | సాయిపల్లవి, శ్రీలీల తమిళ మూవీ టైటిల్ ఇదే - అల్లు అర్జున్ పుష్ప తో లింక్?

Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా 'పోచంపల్లి సిల్క్ స్టోల్'.. అందజేసిన ప్రధాని మోదీ



