Uppal Sky Walk lift | ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువకుడు.. అర్ధరాత్రి 2 గంటల పాటు నరకయాతన
Uppal Sky Walk lift | ఓ 20 ఏళ్ల యువకుడు ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్( Uppal Sky Walk lift )లో ఇరుక్కుపోయాడు. సుమారు 2 గంటల పాటు లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
Uppal Sky Walk lift | త్రినేత్ర.న్యూస్ : ఓ 20 ఏళ్ల యువకుడు ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్( Uppal Sky Walk lift )లో ఇరుక్కుపోయాడు. సుమారు 2 గంటల పాటు లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాహుల్(20) అనే యువకుడు ఉప్పల్‌లోని ఓ ప్రయివేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తన విధులు ముగిశాక హాస్టల్‌కు చేరుకునేందుకు ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ ఎక్కాడు. మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోయింది. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు.
గమనించిన ప్రయాణికులు, వాహనదారులు పోలీసులను అప్రమత్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, లిఫ్ట్ టెక్నిషీయన్స్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. అర్ధరాత్రి 1.15 గంటలకు రాహుల్ బయటకు వచ్చాడు.
ప్రాణాలతో బయటపడ్డ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. లిఫ్ట్‌లో మధ్యలోనే ఆగిపోయేసరికి ప్రాణం పోయినంత పనైంది. రెండు గంటల పాటు లిఫ్ట్‌లోనే ఉండేసరికి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. తన ప్రాణాలను కాపాడిన పోలీసులకు, టెక్నిషీయన్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాహుల్ చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sing Geetham Review | సింగ్ గీతం రివ్యూ - మాటల్లేవ్... సినిమా మొత్తం పాటలే - విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ రోల్!
- ●Raghava Lawrence | మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
- ●WhatsApp | వాట్సాప్‌లో షెడ్యూల్డ్ మెసేజ్‌లు.. ఐఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్..
- ●Stock Markets | ట్రంప్ ప్రకటనతో జోష్‌లో మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..
- ●Mohan Bhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై రాళ్ల దాడి..!
- ●Milk Packets | పాల ప్యాకెట్లు వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా..?

Sing Geetham Review | సింగ్ గీతం రివ్యూ - మాటల్లేవ్... సినిమా మొత్తం పాటలే - విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ రోల్!

Raghava Lawrence | మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన

WhatsApp | వాట్సాప్‌లో షెడ్యూల్డ్ మెసేజ్‌లు.. ఐఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్..

Stock Markets | ట్రంప్ ప్రకటనతో జోష్‌లో మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..






