త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suriya | సూర్య విశ్వ‌నాథ్‌ అండ్ స‌న్స్ ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది – కిస్సిక్ సింగ‌ర్ వాయిస్‌తో…

క‌రుప్పు బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత తెలుగు మూవీ విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌లో హీరోగా న‌టిస్తోన్నాడు సూర్య‌. ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఆగ‌స్ట్ 14న రిలీజ్ కాబోతుంది. విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ ఫ‌స్ట్ సింగిల్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Jun 19, 2026, 5.56 pm IST

Suriya | సూర్య విశ్వ‌నాథ్‌ అండ్ స‌న్స్ ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది – కిస్సిక్ సింగ‌ర్ వాయిస్‌తో…
Advertisement

Suriya | క‌రుప్పు మూవీతో దాదాపు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత పెద్ద హిట్టు అందుకున్నాడు సూర్య‌. సోషియో ఫాంట‌సీ యాక్ష‌న్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. క‌రుప్పు త‌ర్వాత సూర్య తెలుగు మూవీ విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. సార్‌, ల‌క్కీ భాస్క‌ర్ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఫ‌స్ట్ సింగిల్‌....

విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. "నేనో బ‌ట‌ర్‌ఫ్లై.." అంటూ సాగిన రొమాంటిక్ సాంగ్‌ను కిస్సిక్ ఫేమ్ సుభాష్లిణి ఆల‌పించింది. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం స‌మ‌కూర్చారు. "రఫ్ అయిన నువ్వు.. టఫ్ అయిన నేను.. మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే" అంటూ ఈ పాట‌లోని లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఈ ఫ‌స్ట్ సింగిల్‌లో మాస్ స్టెప్పుల‌తో మ‌మితా బైజు అద‌ర‌గొట్టింది. సూర్య‌, మ‌మితా కెమిస్ట్రీని అందంగా చూపించారు. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ర‌వీనా టాండ‌న్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది.

&

Advertisement

తాజావార్తలు

Advertisement