త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | ప్రైవేట్ ఆసుప‌త్రి తెరిచేందుకు ల‌క్ష‌ లంచం.. ఏసీబీకి చిక్కి డీఎంహెచ్‌వో

ACB Raids | ఏసీబీ రైడ్స్, ప‌ట్టుబ‌డిన‌ రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వ‌ర్ణ‌కుమారి, ల‌క్ష లంచం డిమాండ్‌, ఇవీ వివ‌రాలు..

S

Telangana | Published On Oct 5, 2026, 6.50 pm IST

ACB Raids | ప్రైవేట్ ఆసుప‌త్రి తెరిచేందుకు ల‌క్ష‌ లంచం.. ఏసీబీకి చిక్కి డీఎంహెచ్‌వో
Advertisement

ACB Raid | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో ఇటీవ‌ల అవినీతి అధికారులు ప‌దుల సంఖ్యలో ఏసీబీకి ప‌ట్టుబ‌డుతున్నా అధికారుల్లో ఏమాత్రం మార్పు రావ‌డం లేదు. కుక్క తోక వంక‌ర అనే చందంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌క్ర బుద్ధిని చాటుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వ‌ర్ణ‌కుమారి ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేందుకు ల‌క్ష లంచం డిమాండ్ చేశారు. సోమ‌వారం లంచం డ‌బ్బులు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.

హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌, ఆయ‌న డ్రైవ‌ర్‌ను సైతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లంచం ఎంత డిమాండ్ చేశార‌నేదానిపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement