త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | వ‌చ్చే దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి (Singareni) కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్‌ (Bonus) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జీ కిష‌న్‌రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Oct 5, 2026, 4.44 pm IST

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి
Advertisement

Kishan Reddy | త్రినేత్ర న్యూస్: వ‌చ్చే దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి (Singareni) కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్‌ (Bonus) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జీ కిష‌న్‌రెడ్డి తెలిపారు. సింగ‌రేణి పరిశ్ర‌మ‌ ఉత్ప‌త్తి సంస్థ మాత్ర‌మే కాద‌ని.. తెలంగాణకు కొంగు బంగార‌మ‌ని కొనియాడారు. దేశం, తెలంగాణ అభివృద్ధిలో కీల‌క భాగ‌స్వామిగా ఉంద‌న్నారు. ఈమేర‌కు సోమ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నాను. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన‌ 60 వేల కోట్లు ఇవ్వాలి

దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణికి ఇవ్వాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి. సింగరేణి కార్మికులకు, ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కిష‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement