Arattai Business | వాట్సాప్‌కు జోహో మరో సవాల్.. అరట్టై బిజినెస్ లైవ్..
Arattai Business | ప్రముఖ స్వదేశీ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్, యాప్ అరట్టై మెటాకు చెందిన వాట్సాప్‌కు గట్టి పోటీనిస్తోంది. అందులో భాగంగానే అరట్టై మాతృసంస్థ జోహో కొత్తగా ఇదే ప్లాట్‌ఫామ్‌కు గాను వ్యాపారులకు, పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా అరట్టై ఫర్ బిజినెస్‌ను ప్రవేశపెట్టింది. ఇది కూడా వాట్సాప్‌కు చెందిన వాట్సాప్ బిజినెస్ యాప్‌కు పోటీగా లాంచ్ అయినట్లు స్పష్టమవుతోంది.
Technology | Published On Oct 2, 2026, 1.33 pm IST
Arattai Business | ప్రముఖ స్వదేశీ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్, యాప్ అరట్టై మెటాకు చెందిన వాట్సాప్‌కు గట్టి పోటీనిస్తోంది. అందులో భాగంగానే అరట్టై మాతృసంస్థ జోహో కొత్తగా ఇదే ప్లాట్‌ఫామ్‌కు గాను వ్యాపారులకు, పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా అరట్టై ఫర్ బిజినెస్‌ను ప్రవేశపెట్టింది. ఇది కూడా వాట్సాప్‌కు చెందిన వాట్సాప్ బిజినెస్ యాప్‌కు పోటీగా లాంచ్ అయినట్లు స్పష్టమవుతోంది. మెటా తాజాగా వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో వ్యాపారులు పంపే పలు సందేశాలకు చార్జిలను వసూలు చేస్తామని ప్రకటించిన అనంతరం జోహో ఈ అరట్టై ఫర్ బిజినెస్‌ను లాంచ్ చేయడం విశేషం. అయితే వాట్సాప్ బిజినెస్ ప్రస్తుతం చార్జిలు చెల్లించి వాడుకునే ప్లాట్‌ఫామ్‌గా మారగా, అరట్టై ఫర్ బిజినెస్ మాత్రం ప్రస్తుతానికి వినియోగదారులందరికీ ఉచితమేనని జోహో ప్రకటించింది. ఈ మేరకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తన సామాజిక వేదిక ఖాతా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అరట్టై ఫర్ బిజినెస్ యాప్ ప్రస్తుతం లైవ్ అయిందని దీన్ని ఉచితంగానే వాడుకోవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగానే అందిస్తున్నట్లు చెప్పారు.
10 లక్షల సందేశాల వరకు ఉచితం..
అరట్టై ఫర్ బిజినెస్ యాప్ ప్రస్తుతం వినియోగదారులకు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉందని, వ్యాపారులు తమ కస్టమర్లతో, అంతర్గతంగా ఉద్యోగులతో సులభంగా సంభాషణలు జరపవచ్చని శ్రీధర్ వెంబు తెలిపారు. అరట్టై ఫర్ బిజినెస్‌తోపాటు జోహో సంస్థ అరట్టై బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రవేశపెట్టింది. సంస్థలు తమకు అవసరమైన వివిధ సాఫ్ట్ వేర్ వ్యవస్థలను ఈ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయవచ్చు. మెసేజింగ్ సేవను కూడా ఇందులో భాగంగా వాడుకోవచ్చు. ప్రభుత్వ, ప్రజా సేవలకు, ముఖ్యంగా రైల్వే సేవలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగా అందిస్తామని శ్రీధర్ వెంబు తెలిపారు. ఆరోగ్య, విద్యా సంస్థలకు కూడా అరట్టై ఫర్ బిజినెస్ సేవలను పరిమిత కోటా వరకు ఉచితంగానే అందించనున్నట్లు చెప్పారు. ఆయా సంస్థలకు నెలకు 10 లక్షల సందేశాల వరకు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు.
వాట్సాప్ బిజినెస్‌కు గట్టి పోటీ..
అరట్టై అనేది తమిళ పదం. దీనికి తెలుగులో సరదాగా కబుర్లు చెప్పుకోవడం, సంభాషణలు చేయడం అని అర్థాలు వస్తాయి. ఈ యాప్‌ను లాంచ్ చేసిన సమయంలో భారీ ఎత్తున దేశీయ వినియోగదారులు ఈ యాప్‌ను తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్నారు. దీంతో యాప్ స్టోర్‌లలో ఈ యాప్ ప్రథమ స్థానంలో నిలిచి యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇదే యాప్‌కు కొనసాగింపుగా జోహో సంస్థ ఇప్పుడు బిజినెస్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీంతో వ్యాపారులు, సంస్థలకు సంభాషణలు జరపడం మరింత సులభతరం అవుతుంది. అరట్టై యాప్ ఇప్పటికే నేరుగా వాట్సాప్‌కు పోటీ ఇస్తుండగా, ఇప్పుడు అరట్టై ఫర్ బిజినెస్ కూడా వాట్సాప్ బిజినెస్‌కు పోటీనిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అరట్టై ఫర్ బిజినెస్ యాప్‌కు గాను పెయిడ్ ప్లాన్ల వివరాలను ఇంకా ప్రకటించలేదు. కానీ ఒక పరిమితి వరకు ఉచితంగానే అందించనున్నారని సమాచారం. అయితే ఇప్పటికి మాత్రం ఈ యాప్‌ను అందరూ ఉచితంగానే వాడుకోవచ్చు.
డేటాకు పూర్తి రక్షణ..
ఇక అరట్టై ఫర్ బిజినెస్ ద్వారా వ్యాపారులు తమ కస్టమర్లతోపాటు ఉద్యోగులతోనూ అంతర్గతంగా సంభాషణలు చేయవచ్చు. ప్లాట్‌ఫామ్‌కు చెందిన మొత్తం డేటా పూర్తిగా భారత్‌లోనే ఉంటుందని జోహో తెలిపింది. అలాగే కమ్యూనికేషన్ మరింత సురక్షితంగా ఉంటుందని, అన్ని సంభాషణలకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని, పంపేవారు, స్వీకర్తలకు తప్ప ఇతరులకు యాక్సెస్ ఉండదని స్పష్టం చేసింది. దీన్ని ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులు డౌన్ లోడ్ చేసి వినియోగించుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Zia Chat | జియా చాట్‌ను లాంచ్ చేసిన జోహో.. ఉద్యోగులకు పవర్ఫుల్ టూల్..
సెప్టెంబర్ 24, 2026

Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..
జులై 15, 2026

AI Business Agent | ఏఐ బిజినెస్ ఏజెంట్‌ను ప్రవేశపెట్టిన మెటా.. వ్యాపారాలకు ఇది గేమ్ చేంజర్ టూల్..
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్
- ●Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
- ●Governor, CM Revanth | మహాత్ముడికి గవర్నర్, ముఖ్యమంత్రి నివాళులు
- ●Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది
- ●CM Vijay | బస్సు కండక్టర్‌గా సీఎం విజయ్.. స్వయంగా టికెట్లు ఇచ్చి
- ●ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..

Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్

Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత

Governor, CM Revanth | మహాత్ముడికి గవర్నర్, ముఖ్యమంత్రి నివాళులు

Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది



